మీ ‘ఇంటెలిజెన్స్’ ను అడగండి

Published : Nov 09, 2016, 12:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
మీ ‘ఇంటెలిజెన్స్’ ను అడగండి

సారాంశం

వారణాసికి వెళితే సోనియాగాంధీని కలిసానంటారా? టిఆర్ఎస్ పై మండిపడ్డ టి జెఏసి ఛైర్మన్ కోదండరాం ప్రజా సమస్యలపై చర్చించాలని సూచన

‘కొందరు టీఆర్ఎస్ నేతలు నేను ఢిలీల వెళ్లి సోనియా గాంధీని కలిసి వచ్చానని అంటున్నారు. వాళ్లు చెప్పిన రోజుల్లో నేను వారణాసికి వెళ్లానేతప్ప ఢిల్లీకి కాదు, జూన్ 27న ఇందిరాపార్క్ ధర్నాలో పాల్గొన్నా. నేను ఎప్పుడు ఎక్కడ ఎం చేస్తున్నానో, ఎవరెవరిని కలుస్తున్నానో తెలుసుకోలేనంత బలహీనంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉందా?’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వానిన ప్రశ్నించారు.

తనను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ప్రభుత్వం తనపై దాడిచేస్తున్నదని ఆరోపించారు.

ప్రజాసమస్యలపై సమాధానం చెప్పలేకే అధికార పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం జేఏసీ పై ప్రతిచోటా దౌర్జన్యం చేస్తున్నదన్నారు. నవంబర్ 11న మంథనిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. 13న హైదరాబాద్‌లో వైద్యరంగ సమస్యలపై సదస్సు, 20న హైదరాబాద్‌లో సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలు, ఓపెన్ కాస్ట్‌ల సమస్యలపై సదస్సు తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Bandi Sanjay Reaction About Akhanda2 : అఖండ 2 సినిమా చూసి బండి సంజయ్ రియాక్షన్| Asianet News Telugu
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు: Telangana Assembly | Asianet News Telugu