ఉద్యోగ పరీక్షల క్యాలెండర్ విడుదల చేయండి : కోదండరామ్

First Published Mar 11, 2017, 9:07 AM IST
Highlights

పాలాభిషేకాలను తప్ప ప్రశ్నించడాన్ని అనుమతించమంటున్నారు పాలకులు

పనిచేసే శక్తి ఉన్న యువకులకు పని చూపించకపోతే ఆర్థిక వ్యవస్థలో లోపం ఉన్నట్లే. గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేస్తామంటే వారికి పనిదొరకడం లేదు.  చదువుకున్న వాళ్ళకు కొలువు లేదు,  చదువకోని వాళ్ళకు పనిలేదు.  ఇది ఇప్పటి పెద్ద సమస్య,’  అని ఆయన అన్నారు.

 

విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ శనివారం  నాడు ఉస్మానియా యూనివర్శటీలో  ఏర్పాటు చేసిన “విద్యార్థి మహా దీక్ష ” లో కోదండరామ్ పాల్గొన్నారు.

 

ఆయన ఇంకా ఇలా అన్నారు:

 

చదువుకున్న నిరుద్యోగ విద్యార్థులు ఊర్లకు పోలేని పరి స్థితి నెలకొనింది. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పిన లక్షకుపైగా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌లకు ప్రభుత్వం పూనుకోవాలి. ఉద్యోగాల పోటీపరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేయాలని మేం అడుగుతున్నం. ప్రభుత్వం నుంచి స్పందనే లేదు.  ఉద్యోగాల ఖాలీలమీద, భర్తీల  మీద ఎన్ని రకాల లెక్కలు చెబుతున్నారో లెక్కలేదు.  తెలం గా ణ ప్రజలు సమరశీలురు.  గట్టిగా పోరాడే చైతన్యం నేర్చుకున్నారు. తెలంగాణ సమాజానికి కొట్లా డే బలం ఉంది. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరంతర కార్యాచరణతో విద్యార్థులు ముందుకుసాగాలి,’ అని ఆయమన పిలుపు నిచ్చారు.

 

పాలాభిషేకాలను  తప్ప ప్రశ్నించడం ఒప్పుకోమనే ధరోణి  ప్రభుత్వం లో కనిపిస్తావుందని ఆయన విమర్శించారు.

 

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 5900 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని, లక్షకుపైగా ఉద్యోగాల భర్తీ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

ఇప్పుడు నిరుద్యోగులు ఐక్యమై కేసిఆర్‌ను బజార్లోకిలాగాలని చెబుతూ కేసి ఆర్ పాలనకు నిరుద్యోగులు చరమగీతం పాడతారని అన్నారు. టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ ,తెలం గాణ ఉద్యమ వేదిక అధ్యక్షులు డా. చెరుకు సుధా కర్, టఫ్ నాయకురాలు విమలక్క,న్యూడెమాక్రసీ నాయ కులు గోవర్దన్, టి-జేఏసి ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నాయ కులు ఇటిక్యాల పురుషోత్తం, కాంగ్రెస్ నాయకులు పున్న కైలా స్‌నేత, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు వేణు, ఒయు నాయకులు ఆర్‌ఎన్ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

click me!