రమణతో భేటీ: మహా కూటమికి కోదండరామ్ సై

By pratap reddyFirst Published Sep 13, 2018, 9:26 PM IST
Highlights

మహా కూటమిలో చేరడానికి కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితి (టీజెఎస్) సిద్ధపడింది. గురువారం సాయంత్రం టీడీపీ నేత ఎల్.రమణ నివాసంలో సీపీఐ, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు.

హైదరాబాద్‌: మహా కూటమిలో చేరడానికి కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితి (టీజెఎస్) సిద్ధపడింది. గురువారం సాయంత్రం టీడీపీ నేత ఎల్.రమణ నివాసంలో సీపీఐ, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. 

మహాకూటమితోనే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోగలమని తమ పార్టీ విశ్వసిస్తోందని కోదండరాం అన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం‌ ఛైర్మన్‌గా కోదండరాంను చేయాలని టీజేఎస్‌ సూచిస్తోంది. మహాకూటమి అధికారంలోకి వస్తే.. కనీస ఉమ్మడి కార్యక్రమం‌ ద్వారా చక్రం తిప్పాలని కోదండరాం ఆలోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి..

సీట్ల విషయంలో పట్టువిడుపులతో ముందుకెళ్ళాలని టీజెఎస్ భావిస్తోంది. టీజెఎస్ తమకు 30 సీట్లు కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో టీడీపీ, సీపీఐలని ఒప్పించిన తర్వాత కాంగ్రెస్ ముందు తమ డిమాండ్లను‌ ఉంచాలని కోదండరాం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశంలో సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టిజెఎస్ నేత దిలీప్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

click me!