కేకే  క్లాసు ఖరీదు ... 2 లక్షలు

Published : Apr 25, 2017, 01:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కేకే  క్లాసు ఖరీదు ... 2 లక్షలు

సారాంశం

కేకే కంటే ముందు హరీష్ రావు, కేటీఆర్, కవిత కూడా కూలీ పనులు చేసి డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే.  

సీనియర్ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు ఈ రోజు టీచర్ అవతారం ఎత్తారు. స్వతహాగా మేధావి, మంచి రాజకీయ విశ్లేషకుడిగా పేరున్న ఆయన గులాబీ నేతలకు తరచుగా తన అనుభవాలను రంగరించి రాజకీయ పాఠాలు చెబుతుంటారు.అయితే ఈ సారి మాత్రం విద్యార్థులకు పాఠాలు చెప్పారు.

 

27 న వరంగల్ లో టీఆర్ఎస్ 16 వార్షికోత్సవ సభ జరగనున్న విషయం తెలిసిందే. దీనికి హాజరయ్యేందుకు గులాబీ పని దినాల్లో భాగంగా కేకే .. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠాదలు బోధించారు.

 

అలా పాఠాలు చెప్పి  రెండు లక్షల రూపాయలు సంపాదించారు. అటు తర్వాత  నగర శివారులోని  అబ్దుల్లాపూర్ మెట్ లోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు తీసుకొని రూ. 2 లక్షల 20 వేల సంపాదించారు.

 

కేకే కంటే ముందు హరీష్ రావు, కేటీఆర్, కవిత కూడా కూలీ పనులు చేసి డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?