BRS Party: 2036 వరకు బీఆర్ఎస్ పార్టీని డిస్‌క్వాలిఫై చేస్తారా?

By Mahesh K  |  First Published Feb 20, 2024, 2:42 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని కాగ్ రిపోర్టులో వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ను ఆధారం చేసుకుని కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతరావు ఈసీకి లేఖ రాశారు. ఈ రుణాల చెల్లింపు పూర్తయ్యే దాకా లేదా 2035-36 వరకు బీఆర్ఎస్ పార్టీపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
 


Election Commission: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి, అవకతవకల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నీటి యుద్ధం చేసింది. ఇటీవలే కాగ్ విడుదల చేసిన రిపోర్ట్ కూడా బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఉన్నది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక ఆర్థిక పరమైన అవకతవకలు ఉన్నాయని కాగ్ పేర్కొంది. ఇది బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో సానుకూల అభిప్రాయాలను మార్చేలా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కాగ్ రిపోర్ట్‌ను ఆధారం చేసుకుని కూడా బీఆర్ఎస్ పై దాడికి సిద్ధమైంది. ప్రజల్లో ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయడమే కాదు.. న్యాయపరమైన చిక్కులను తెచ్చేలా ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. 2035-36 వరకైనా బీఆర్ఎస్ పార్టీని డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు కాగ్ రిపోర్ట్‌ను ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీ భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రాజెక్ట్ కాస్ట్‌ను పెంచి అవినీతికి పాల్పడిందని పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పలు ఆర్థిక సంస్థల నుంచి రూ. 1,41,544 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిందని, ఇప్పుడు రూ. 2,52,048 కోట్లు రీపేమెంట్‌కు అప్పు పెరిగిందని వివరించారు.

Latest Videos

undefined

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఖజానాపై తీవ్ర భారాన్ని తెచ్చిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఆటంకంగా మార్చిందని వీహెచ్ ఫైర్ అయ్యారు.

Also Read : BRS: మెదక్‌లో ఓడిస్తే బీఆర్ఎస్‌కు చావుదెబ్బే! సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఇదేనా?

‘అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ పార్టీపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉన్నది. అలా చేస్తే భవిష్యత్‌లో మరే ఇతర పార్టీలు అవినీతి చేయకుండా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా సంకేతాలను పంపినట్టు అవుతుంది. ఈ రుణ చెల్లింపులు పూర్తయ్యేదాకా లేదా 2035-36 వరకైనా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని వీహెచ్ రిక్వెస్ట్ చేశారు.

నిజంగానే ఎన్నికల సంఘం మాజీ ఎంపీ వీహెచ్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ పార్టీపై అనర్హత వేటు వేస్తుందా? ఇది ఇప్పుడే చెప్పలేం. ఈసీ నిర్ణయాన్ని అంచనా వేయలేం. అయితే.. ఈ లెటర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల్లో బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయడంలో ఉపకరిస్తుందని చెప్పవచ్చు.

click me!