అమిత్ షా అభినవ సర్దార్ పటేల్.. 75 ఏళ్ల తర్వాత అధికారికంగా తెలంగాణ విముక్తి ఉత్సవాలు: కిషన్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Sep 17, 2022, 10:27 AM IST
Highlights

తెలంగాణ గడ్డపై జాతీయ ఎగరవేసేందుకు ఎందరో ప్రాణాలు ఆర్పించారని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా నిజాం పాలిత ప్రాంతాల్లో విముక్తి దినోత్సవం నిర్వహించాయని తెలిపారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణలో స్వాతంత్య్ర వేడుకలను గత ప్రభుత్వాలు జరపలేదని చెప్పారు.

తెలంగాణ గడ్డపై జాతీయ ఎగరవేసేందుకు ఎందరో ప్రాణాలు ఆర్పించారని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా నిజాం పాలిత ప్రాంతాల్లో విముక్తి దినోత్సవం నిర్వహించాయని తెలిపారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణలో స్వాతంత్య్ర వేడుకలను గత ప్రభుత్వాలు జరపలేదని చెప్పారు. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండ్, కర్ణాటక రవాణాశాఖ మంత్రి బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 

ఈ వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అని అన్నారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. సెప్టెంబర్ 17 నిజాం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడిన రోజు అని అన్నారు. 1948లో నిజాంను ఓడించి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ జెండాను గర్వంగా ఎగరవేశారని గుర్తుచేశారు. 25 ఏళ్ల నుంచి ఈ వేడుకలను నిర్వహించాలని పోరాటం చేస్తున్నామని చెప్పారు. బీజేపీ పోరాటంతోనే ఇప్పుడు విమోచన దినోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. 

1948లో నిజాంను ఓడించి సర్దార్ పటేల్ జాతీయ జెండాను ఎగరవేశారని.. 75 ఏళ్ల తర్వాత అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మళ్లీ 75 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 17న హైదరాబాద్ గడ్డపై త్రివర్ణ పతాకం ఎగురుతోందన్నారు. 

click me!