ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Published : Sep 17, 2022, 09:39 AM IST
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వ్య‌క్తిగ‌తంగా, రాష్ట్ర ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వ్య‌క్తిగ‌తంగా, రాష్ట్ర ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. మోదీకి భ‌గ‌వంతుడు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏళ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన లేఖను సీఎంవో కార్యాలయం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 

 


ఇక, గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?