తెలంగాణకున్న మూడు ఇబ్బందులు పరిష్కరించాం : కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై కిషన్ రెడ్డి

By Siva Kodati  |  First Published Oct 4, 2023, 4:29 PM IST

తెలంగాణకు సంబంధించిన మూడు కీలక అంశాలపై కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని తెలిపారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీజలాల పరిష్కారం చేశామని ఆయన వెల్లడించారు.


తెలంగాణకు సంబంధించిన మూడు కీలక అంశాలపై కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని తెలిపారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీజలాల పరిష్కారం చేశామని ఆయన వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు. 

ALso Read: తెలంగాణకు గిరిజన యూనివర్శిటీ, జాతీయ పసుపుబోర్డు: కేంద్రకేబినెట్ కీలక నిర్ణయాలు

Latest Videos

ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీలు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. అయితే 2013లో ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చినా, గెజిట్ కాలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసిందన్నారు. 2021లో కేంద్రం అభ్యర్ధనతో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ ఉపసంహరించుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. సొలిసిటీర్ జనరల్ సూచనలతో కేంద్రం ప్రస్తుతం చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 9.08 శాతం మంది గిరిజనులు వున్నారని.. వీరి అక్షరాస్యత 49.51గా వుందని కిషన్ రెడ్డి చెప్పారు. రూ.900 కోట్లతో యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. 

click me!