దేశంలో రేపిస్టులందరినీ ఎన్ కౌంటర్ చేసేవరకు నేను ఇక్కడినుంచి కదలను చెన్నకేశవులు భార్య

By telugu team  |  First Published Dec 7, 2019, 1:58 PM IST

నిందితులు చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మతో పాటు శివ కుటుంబీకులు, బంధువులు గుడిగండ్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు ఇలా ఎన్‌కౌంటర్‌ చేసి నా భర్తను చంపడం న్యాయామా అంటూ చెన్నకేశవులు భార్య ప్రశ్నించింది. 


మహబూబ్ నగర్: దిశా హత్యాచారం ఘటన నిందితుల కుటుంబాలు తమ వాళ్ళ శవాలను తమకు అప్పగించాలని రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలుపుతున్నారు. తమ వారితోనే కనీసం ఒక సారి ఫోన్లో కూడా మాట్లాడనివ్వలేదని వారు వాపోతున్నారు. కనీసం శవాలనన్న అప్పగించండంటూ, వారితోపాటు గ్రామస్థులు కూడా బైఠాయించారు. 

నిందితులు చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మతో పాటు శివ కుటుంబీకులు, బంధువులు గుడిగండ్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు ఇలా ఎన్‌కౌంటర్‌ చేసి నా భర్తను చంపడం న్యాయామా అంటూ చెన్నకేశవులు భార్య ప్రశ్నించింది. 

Latest Videos

undefined

Also read: నా భర్త మృతదేహన్ని అప్పగించండి: చెన్నకేశవులు భార్య

దేశంలో ఇలా అత్యాచారం నేరం కింద జైళ్లలో ఉన్న అందరిని ఎన్ కౌంటర్ చేసి చంపేంతవరకు తాను ఇక్కడి నుండి కదలబోనని ఆమె చెప్పింది. తాను కడుపుతో ఉన్నాననే కనికరం కూడా లేకుండా, పోలీసులు తన భర్తను చంపేశారని ఆమె అన్నది. 

తన భర్త శవాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే తనను కూడా తన భర్త గుంతలోనే వేసి పూడ్చేయండని ఆమె రోదిస్తూ అధికారులను, మీడియా వారిని కోరింది.  తన భర్తను చంపడంతో అందరి కడుపు చల్లాగా అయ్యింది కదా, ఇంకా ఎందుకు మీరు డైరెక్ట్‌గా తీసుకెళ్లి పూడ్చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

accused encounter: ఎన్ హెచ్ఆర్సీపై దిశ ఫ్యామిలీ సంచలన వ్యాఖ్యలు

మీ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరిపేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసానిచ్చారు.తప్పు చేసిన వారిని శిక్షించడం న్యాయమే...కానీ ఆ పేద కుటుంబాలకు దిక్కు ఎవరంటూ గ్రామస్తులు సైతం వాపోయారు. నిందితులు మహ్మద్‌ ఆరీప్, నవీన్, చెన్నకేశులు వారి తల్లిదండ్రులకు వీళ్ళు ఒక్కరే కుమారులు. 

ఆ కుటుంబాల జీవన పరిస్థితి ఏంటని, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గ్రామస్థులు అన్నారు.  నిరు పేద కుటుంబాలకు చెందిన వారు తప్పుచేసిన వారు  నిరు పేద కుటుంబాలకు చెందిన వారు కాబట్టి ఎన్‌కౌంటర్‌ చేశారని, వీళ్ళను చేసిన విధంగా పెద్ద వాళ్ల పిల్లలు తప్పు చేసినప్పుడు ఇలాగే ఎన్‌కౌంటర్‌ చేసి చంపాలని నిందితుల కుటుంబీకులు డిమాండ్‌ చేశారు.

click me!