నిబంధనల బేఖాతరు.. హైదరాబాద్‌ పబ్బుల్లో ప్రత్యక్షమైన పిల్లలు, వీడియోలు వైరల్

Siva Kodati |  
Published : Dec 15, 2021, 04:54 PM IST
నిబంధనల బేఖాతరు.. హైదరాబాద్‌ పబ్బుల్లో ప్రత్యక్షమైన పిల్లలు, వీడియోలు వైరల్

సారాంశం

హైదరాబాద్‌లో (hyderabad) పబ్బుల (pub)  తీరు వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని (jubilee hills) ఓ పబ్‌లోకి నలుగురు పిల్లలను అనుమతించింది యాజమాన్యం.

హైదరాబాద్‌లో (hyderabad) పబ్బుల (pub)  తీరు వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని (jubilee hills) ఓ పబ్‌లోకి నలుగురు పిల్లలను అనుమతించింది యాజమాన్యం. పబ్‌లో ఓ వైపు ఫుల్‌గా మద్యం తాగి నృత్యాలు చేస్తుండగానే.. పిల్లలు పబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఎక్సైజ్ శాఖ ఎన్ని దాడులు చేసినప్పటికీ .. ఎన్ని కథనాలు మీడియా ప్రసారం చేసినప్పటికీ పబ్‌ల తీరు మాత్రం మారడం లేదు. 21 సంవత్సరాల లోపు పిల్లలను, మైనర్లను పబ్‌లోకి అనుమతించకూడదని కఠిన నిబంధనలు వున్నాయి. అయినప్పటికీ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు నిర్వాహకులు. 

Also Read:టాలీవుడ్ పబ్‌లో అర్ధనగ్న డ్యాన్స్‌లు, అసాంఘిక కార్యకలాపాలు.. పోలీసుల దాడితో వెలుగులోకి

అంతకుముందు నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న టాలీవుడ్ పబ్‌పై (tollywood club) శనివారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులకు దిగారు. పబ్‌లో వికృత ఛేష్టలకు పాల్పడుతోన్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పబ్‌లో సమయం దాటిన తర్వాత కూడా యువతి యువకులు అర్థనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారని సమాచారం. ఇటీవలే ఈ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు  జరిపి నోటీసులు జారీ చేశారు. అయితే గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా వుంది టాలీవుడ్ పబ్. ఇటీవలే పబ్‌కు వచ్చిన భార్యాభర్తలపై పబ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేయడంతో కొంత కాలం సీజ్ చేశారు పంజాగుట్ట పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?