Nalgonda Road Accident: గేదె అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. ఇద్దరు చిన్నారులు మృతి..

Published : Dec 15, 2021, 04:40 PM IST
Nalgonda Road Accident: గేదె అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. ఇద్దరు చిన్నారులు మృతి..

సారాంశం

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో (nalgonda district) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గేదెను తప్పించబోయి బైక్ కిందపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో (nalgonda district) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గేదెను తప్పించబోయి బైక్ కిందపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు (Two kids died). మృతులను నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వ్యక్తి బైక్‌పై నల్గొండ కలెక్టరేట్‌ నుంచి ఎఫ్‌సీఐ రోడ్డు మీదుగా టౌన్‌లోకి వస్తున్నారు. బైక్‌పై అతనితో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గొల్లగూడ శివారు ఎఫ్‌సీఐ గోదాముల వద్ద బైక్‌కు గేదె అడ్డం వచ్చింది. దీంతో అతడు బైక్‌కు సడన్ బ్రేక్ వేయడంతో బైక్‌పై ఉన్నవారు కిందపడ్డారు.

ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రోడ్డు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకన్నారు.  అంబులెన్స్ పిలిపించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు పంపించారు. డాక్టర్లతో మాట్లాడి గాయాలైన వారికి వెంటనే తగిన చికిత్స చేయాల్సిందిగా కోరారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నెల్లూరు రెండో పట్టణ పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

ఏపీలో వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తొమ్మిది మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు. బుధవారం నాడు ఉదయం Ashwa raopetaనుండి jangareddygudem వైపునకు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.  బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని క్షతగాత్రులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు Rtc Bus డివైడర్ ను ఢీకొట్టిందని చెప్పారు.  ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు