మైన‌ర్ల కిడ్నాప్.. ఇద్ద‌రు తెలంగాణ వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన యూపీ పోలీసులు

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 7:06 PM IST
Highlights

Hyderabad: మార్చి 11న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బహ్రైచ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇంతియాజ్, ఛోట్కౌ అలియాస్ వసీం అనే నిందితులు ఇద్దరు బాలికలను (14, 16 ఏళ్ల వయస్సు) అపహరించుకుపోయారని ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు.
 

UP police arrest 2 men from Telangana: ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి స‌హ‌క‌రించిన వారిని ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నామ‌ని కూడా పోలీసులు తెలిపారు. 

మార్చి 11న యూపీలోని బహ్రైచ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇంతియాజ్, ఛోట్కౌ అలియాస్ వసీం అనే నిందితులు ఇద్దరు బాలికలను (14, 16 ఏళ్ల వయస్సు) అపహరించుకుపోయారని ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు. వీరిద్దరూ మైనర్ బాలికలను తెలంగాణలోని కరీంనగర్ కు తీసుకువ‌చ్చారు. దీని స‌మాచారం అందుకున్న యూపీ పోలీసులు.. ఆదివారం నాడు ఇక్క‌డ‌కు చేరుకుని నిందితుల‌ను అరెస్టు చేశారు. 

కిడ్నాప్ చేసిన వారికి సహకరించిన ముగ్గురు మహిళలను గతంలో అరెస్టు చేసి జైలుకు పంపామని వర్మ తెలిపారు. ఇద్దరు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు కరీంనగర్ పోలీసులతో కలిసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్తీ గ్రామంలో బాలికలను ర‌క్షించిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

ఈ నెల 12న బాలికల కుటుంబ సభ్యులు కిడ్నాప్ గురంచి ఫిర్యాదు చేయడంతో  వివ‌రాలు తెలిస్తే చెప్పాల‌నీ, నిందితులకు ఒక్కొక్కరికి రూ.15 వేల నగదు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ప్ర‌స్తుతం యువతులను కౌన్సిలింగ్ కు పంపామని, ఆ తర్వాత జువెనైల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. కాగా, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుల స్థానిక, తెలంగాణ లింకులను పోలీసులు పరిశీలిస్తున్నారని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

click me!