పోతే పోండి, ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో చూసింది కాంగ్రెస్: పార్టీ మారినవారిపై కుంతియా

Published : Mar 20, 2019, 08:58 PM IST
పోతే పోండి, ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో చూసింది కాంగ్రెస్: పార్టీ మారినవారిపై కుంతియా

సారాంశం

బయటకు వెళ్లిన నేతలంతా ఒంటరి అయ్యాక తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ గూటికే చేరుతారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో చూసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్సే గట్టిపోటీ అంటూ చెప్పుకొచ్చారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వీడిన వారిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ టికెట్లు రానివారంతా పార్టీ మారుతున్నారని అలాంటి వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. 

బయటకు వెళ్లిన నేతలంతా ఒంటరి అయ్యాక తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ గూటికే చేరుతారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో చూసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్సే గట్టిపోటీ అంటూ చెప్పుకొచ్చారు. కొందరు నేతలు పార్టీ వీడినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు. వలసలతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని కుంతియా స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?