రేణుకా చౌదరి , పొంగులేటిలకు బీజేపీ గాలం

By narsimha lodeFirst Published Mar 20, 2019, 4:11 PM IST
Highlights

తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు చెందిన కీలకమైన నేతలకు బీజేపీ గాలం వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
 

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు చెందిన కీలకమైన నేతలకు బీజేపీ గాలం వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ ఇప్పటికే బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సోయం బాబురావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.

ఖమ్మం  పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రేణుకా చౌదరి ప్రయత్నాలు చేస్తోంది. రేణుకా చౌదరితో కూడ బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి  ఉంది.

 మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు. మెదక్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెన్ నేతలతో కూడ బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లినట్టుగా చెబుతున్నారు.బీజేపీ నేతలు కూడ ఆమెను మెదక్ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని కోరుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

మరో వైపు నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలతో కూడ బీజేపీ కీలక నేతలు సంప్రదింపులు జరుపుతునట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రికి బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలకనేతలతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

మరో వైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బదులుగా నామా నాగేశ్వర్ రావుకు టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కే అవకాశం ఉంది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడ తమ వైపు లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

బీజేపీ నేతల మంతనాలు: సునీత లక్ష్మారెడ్డి ఊగిసలాట

రాహుల్ ఫోన్ ఎఫెక్ట్: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానా

బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ
'ఉత్త'ర కుమారుడే: రెక్కలు తెగిన పక్షిలా కాంగ్రెస్ విలవిల

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ: కేసీఆర్‌తో భేటీ, కారెక్కనున్న మరో ఎమ్మెల్యే

 

click me!