బీజేపీ నేతల మంతనాలు: సునీత లక్ష్మారెడ్డి ఊగిసలాట

By narsimha lodeFirst Published Mar 20, 2019, 5:44 PM IST
Highlights

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ గాలం వేస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్‌ నేతలు కూడ ఆమెతో మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ గాలం వేస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్‌ నేతలు కూడ ఆమెతో మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కీలకంగా వ్యవహరించారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న  కాలంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా కొనసాగారు.

మంగళవారం నాడు టీఆర్ఎస్‌ కీలక నేతలతో సునీతా లక్ష్మారెడ్డి సమావేశమైనట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె ఖండిస్తున్నారు. అయితే అదే సమయంలో బీజేపీ నేతలు కూడ సునీతా లక్ష్మారెడ్డితో చర్చలు జరిపినట్టుగా చెబుతున్నారు.

బీజేపీలో చేరితే మెదక్ ఎంపీ సీటును కేటాయిస్తామని ఆ పార్టీ నేతలు సునీతా లక్ష్మారెడ్డికి ఆఫర్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ విషయమై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు.

గతంలో వైఎస్ కేబినెట్‌‌లోనూ ఆ తర్వాత  ముఖ్యమంత్రుల కేబినెట్లో  సునీతా లక్ష్మారెడ్డి , డీకే అరుణ, గల్లా అరుణకుమారి, గీతా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మంత్రులుగా కొనసాగారు. సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. డీకే అరుణ బీజేపీలో చేరారు. గల్లా అరుణకుమారి గత ఎన్నికల సమయంలోనే టీడీపీలో చేరారు.

సంబంధిత వార్తలు

రేణుకా చౌదరి , పొంగులేటిలకు బీజేపీ గాలం

రాహుల్ ఫోన్ ఎఫెక్ట్: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానా

బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ
'ఉత్త'ర కుమారుడే: రెక్కలు తెగిన పక్షిలా కాంగ్రెస్ విలవిల

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ: కేసీఆర్‌తో భేటీ, కారెక్కనున్న మరో ఎమ్మెల్యే

click me!