బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఎస్టీ కాదు: కంట తడిపెట్టిన రేఖా నాయక్

By Pratap Reddy Kasula  |  First Published Aug 22, 2023, 11:31 AM IST

తనకు కేసీఆర్ బిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్రంగా కలత చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఎస్టీ కాదని ఆమె ఆరోపించారు.


ఖానాపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ఎస్టీ కాదని, ఆయనది నకిలీ సర్టిఫికెట్ అని ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. తనకు బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను పక్కన పెట్టి కేసీఆర్ ఖానాపూర్ టికెట్ జాన్సన్ నాయక్ కు ఇచ్చారు. దీంతో రేఖా నాయక్ తీవ్రంగా కలత చెందారు.

జాన్సన్ నాయక్ ది నకిలీ సర్టిఫికెట్ అని, ఆ విషయం నిరూపించి తీరుతానని అంటూ ఆమె కంటతడి పెట్టారు. మెట్ పల్లిలోని జాన్సన్ నాయక్ ఇంటిలో చర్చి ఉందని, ఆయన తండ్రి ఫాస్టర్ అని రేఖా నాయక్ అన్నారు. జాన్సన్ ఇంటిలో చర్చి ఉండడాన్ని గానీ ఆయన తండ్రి ఫాస్టర్ కావడాన్ని గానీ తాను తప్పు పట్టడం లేదని , ఆయన ఎస్టీ కాదనేది మాత్రమే తన అభ్యంతరమని ఆమె అన్నారు. జాన్సన్ ఎస్టీ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తెచ్చారో, ఏ ఎమ్మార్వో ఆ సర్టిఫికెట్ ఇచ్చాడో బయటపెడుతానని ఆమె అన్నారు. ఖానాపూర్ నుంచి తాను పోటీ చేసి గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Latest Videos

Also Read: బీఆర్ఎస్‌కు షాక్ : కాంగ్రెస్‌లోకి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు.. తొలుత భర్త, రేపు భార్య

రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ సోమవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి శ్యామ్ నాయక్ ను పార్టీలోకి ఆహ్వానించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన శ్యామ్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాదులోని నిజాం కళాశాలతో మంత్రి కేటీఆర్ తో కలిసి చదువుకున్నారు.

click me!