తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య: 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Aug 18, 2022, 9:14 AM IST
Highlights


ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసుకు సంబంధించి  11 మంది  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో తలదాచుకున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలిస్తున్నారు.

ఖమ్మం: ఈ నెల 15వ తేదీన ఖమ్మం జల్లా తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసుకు సంబంధించి  11 మంది  నిందితులను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  రాజమండ్రిలో ఉన్న  11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఏ -2రంజన్, ఏ-4 గంజిస్వామి,  ఏ-5నూకల లింగయ్య ఏ-6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ-8 నాగయ్య సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు సహా మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బాబాయ్ కొడుకే తమ్మినేని కృష్ణయ్య సుదీర్ఘ కాలం పాటు సీపీఎంలో ఉన్న తమ్మినేని కృష్ణయ్య కొంత కాలం క్రితం సీపీఎంను వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో గ్రామంలో ఆధిపత్య పోరు సాగుతుంది. తమ్మినేని కృష్ణయ్య ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన భార్యను ఎంపీటీసీగా గెలిపించుకున్నాడు. ఆ తర్వాత  తమ్మినేని కృష్ణయ్య టీఆర్ఎస్ లో చేరారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. దీంతో గ్రామంలో సీపీఎం నేతలకు తమ్మినేని కృష్ణయ్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమ్మినేని కృష్ణయ్య అనుచరులతో పాటు కృష్ణయ్యపై కూడా సీపీఎం శ్రేణులు బెదిరింపులకు పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అయినా కూడా లెక్క చేయకుండా కృష్ణయ్య గ్రామంలో పార్టీ  బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారని  ఆ పార్టీ నేతలు చెప్పారు.

ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్స వాన్ని పురస్కరించుకొని పొన్నెకల్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వా ఇంటికి తిరిగి వస్తున్న తమ్మినేని కృష్ణయ్యపై సీపీఎం వర్గీయులు హత్య చేశారని ప్రత్యక్ష సాక్షి ముత్తేశం  మీడియాకు చెప్పారు.  ఇదే విషయమై తమ్మినేని కృష్ణయ్య తనయుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరరకు పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.  నిందితుల కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  ఇవాళ ఏపీలో ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

తమ్మినేని కృష్ణయ్యను హత్య చేసిన తర్వాత నిందితులు మహబూబాద్ లోని సీపీఎం కార్యాలయానికి వెళ్లి అక్కడి నుండి ఏపీకి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఈ  కేసులో ఏ1 నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు.

also read:తమ్మినేని కృష్ణయ్య హత్య: ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎనిమిది మందిపై కేసు

సర్పంచ్ పదవి విషయంలో తమ్మినేని వీరభద్రం కుటుంబానికి తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి మధ్య చోటు చేసుకున్న విబేధాలే కృష్ణయ్య  సీపీఎం నుండి బయటకు వెళ్లడానికి కారణంగా బాధిత కుటుంబ ం చెబుతుంది. సర్పంచ్ పదవికి తమ్మినేని కృష్ణయ్య నామినేషన్ వేస్తే కుటుంబసభ్యులు, పార్టీ నాయకత్వం చర్చలు జరిపడంతో కృష్ణయ్య నామినేషన్ ను ఉప సంహరించుకున్నారు. అయితే ఎంపీటీసీ ఎన్నికల సమయంలో తమ్మినేని కృష్ణయ్య తన పట్టు వీడలేదు. దీంతో సీపీఎం నుండి తమ్మినేని కృష్ణయ్య బయటకు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు.,
 

 

click me!