కాళేశ్వరంలో హద్దులు దాటిన అవినీతి: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్

By narsimha lodeFirst Published Aug 17, 2022, 10:15 PM IST
Highlights


కాళేశ్వరంలో హద్దులు దాటిన అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. . కాళేశ్వరం ప్రాజెక్టకు చెందిన మోటార్లు ముంపునకు గురి కావడంపై విపక్షాలు  తెలంగాణ సర్కార్ పై  విమర్శలు చేస్తున్నాయి.

న్యూఢిల్లీ: కాళేశ్వరంలో హద్దులు దాటిన అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆరోపించారు.బుధవారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.సరైన అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులు నిర్మించారన్నారు.బారీ వర్షాలకు మూడు పంపు హౌజ్ లు మునిగి పోయాయని చెప్పారు. పంపులను టెక్నికల్ గా సరైన పద్దతిలో అమర్చలేదని కేంద్ర మంత్రి విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడే వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. పంపుల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. .మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్ధ్యం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగిందని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవలనే తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మోటార్లు ముంపునకు గురికావడంపై  జరిగిన నష్టాన్ని కాంట్రాక్టర్ నుండి వసూలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్  చేస్తున్న ఇతర ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని ఆమె కోరారు. 

గత నెలలో గోదావరి నదికి భారీగా వరదలు వచ్చాయి. పంప్ హౌస్ ముంపునకు గురైనా కూడా ఈ పంపులను బిగించిన సంస్థలనే వాటి నిర్వహణను చేస్తాయని అధికారులు గతంలోనే ప్రకటించారు. వరదలో ముంపునకు గురైన పంప్ హౌస్ కారణంగా ఎలాంటి నష్టం లేదని కూడా అధికారులు తేల్చి చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై  విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టి రపారేస్తుంది. ఉద్దేశ్యపూర్వకంగానే  ఈ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఈ వ్యాఖ్యలు చేయడంతో  ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ నెల 2వ తేదీన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన గజేంద్ర షెకావత్ బీజేపీ సభలో ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 
 

click me!