మా డిమాండ్లు పరిష్కరించాలి: కేసీఆర్ ను కోరిన ట్రెసా ప్రతినిధులు

By narsimha lode  |  First Published Aug 17, 2022, 9:14 PM IST

తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ ప్రతినిధులు బుధవారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు.  తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించనున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారు. 


హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు బుధవారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు.  రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించారు.. త్వరలోనే  పిలిపించి మాట్లాడతానని సీఎం తెలిపారు.

అంతేకాదు ఈ సమస్యలు పరిష్కరించాలని ఆదేశిస్తానని హామీ ఇచ్చారని ట్రెసా సంఘం నేతలు చెబుతున్నారు.  ఈ కార్యక్రమం లో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. నాగమణి, కార్యదర్శి వాణి, సంయుక్త కార్యదర్శులు ఎల్.వెంకటేశ్వర్ రావు, గోవర్ధన్,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్, జిల్లా కార్యదర్శి వి. రామకృష్ణా రెడ్డి,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,ఉపాధ్యక్షులు గౌరీ వత్సల, జిల్లా కార్యవర్గ సభ్యులు, శామీర్ పేట్ తహసీల్దార్ సత్యనారాయణ,తహసీల్దార్లు విజయలక్ష్మి, భూపాల్,మహిపాల్ రెడ్డి, గీత, ఎస్తేర్ అనిత తదితరులు పాల్గొన్నారు.

Latest Videos

undefined

 


 

click me!