బాబాయ్ తో అక్రమసంబంధం... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి... భర్తను రోకలిబండతో కొట్టిచంపిన భార్య

Arun Kumar P   | Asianet News
Published : Mar 06, 2022, 10:01 AM ISTUpdated : Mar 06, 2022, 10:07 AM IST
బాబాయ్ తో అక్రమసంబంధం... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి... భర్తను రోకలిబండతో కొట్టిచంపిన భార్య

సారాంశం

వావివరసలు మరిచి బాబాయ్ వరసయ్యే వ్యక్తితో శారీరక సంబంధాన్ని కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా భర్తకు పట్టుబడ్డ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడినే అతి కిరాతకంగా హతమార్చిన దారుణం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. 

ఖమ్మం: ఆడామగ తేడాలేదు.. క్షణకాలం శారీరక సుఖం కోసం జీవితాలనే నాశనం చేసుకుంటున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. చివరకు కొందరు ఎంతలా దిగజారుతున్నారంటే వావివరసలు మరిచి సభ్యసమాజం తలదించుకునే అక్రమసంబంధాలను (illict affair) కొనసాగిస్తున్నారు. ఇలా బాబాయ్ వరసయ్యే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకున్న వివాహిత అడ్డుగావున్నాడని కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా హతమార్చిన దారుణం ఖమ్మం జిల్లా (khammam district)లో చోటుచేసుకుంది.  

ఈ  దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం పట్టణ సమీపంలోని కుర్నవల్లి మండలకేంద్రంలోని దళితవాడలో ఇనుపనూరి జయరాజు-నిరోషా దంపతులు నివాసముండేవారు. అయితే మద్యానికి బానిసై కుటుంబ ఆలనాపాలన మరిచి జులాయిగా తిరిగేవాడు జయరాజు. భార్యతో కూడా నిత్యం గొడవపడేవాడు. 

అయితే భర్త తీరుతో విసిగిపోయిన నిరోష మరో వ్యక్తికి దగ్గరయ్యింది. కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన వరసకు బాబాయ్ అయ్యే మాడుగుల కృష్ణతో నిరోషా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. తాగుబోతు భర్త కళ్లుగప్పి బాబాయ్ తో నిరోషా ఏకాంతంగా గడిపేది.  

ఇలా ఇటీవల నిరోషా ప్రియుడు కృష్ణతో వుండగా భర్తకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడింది. వీరిద్దని చూడకూడని స్థితిలో చూసిన జయరాజు గొడవ చేయసాగాడు. విషయం బయటపడితే పరువు పోతుందని భావించిన నిరోషా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. 

అప్పటికే మద్యం మత్తులో వున్న జయరాజును కృష్ణ తన్నడంతో కిందపడిపోయాడు. వెంటనే నిరోషా రోకలిబండను తీసుకుని భర్త తలపై కొట్టడంతో స్ఫృహ కోల్పోయాడు. ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిన జయరాజు కాళ్లను భార్య గట్టిగా పట్టుకోగా ప్రియుడు దుప్పటిని ముఖాన్నిమూసి గట్టిగా పట్టుకోగా ఊపిరాడక చనిపోయాడు. ఇలా ప్రియుడుతో కలిసి భర్తను చంపిన నిరోషా కొత్తనాటకానికి తెరతీసింది. 

తాగిన మైకంలో నిత్యం వేధింపులకు పాల్పడే భర్త ఈసారి తనను చంపడానికి ప్రయత్నించాడని... ప్రాణరక్షణ కోసం అతడిపై దాడిచేయడంతో చనిపోయాడని తెలిపింది. ఆమె మాటలు అనుమానాస్పదంగా వుండటంతో పోలీసులు మరింత లోతుగా విచారించగా ప్రియుడితో కలిసి చంపినట్లు ఒప్పుకుంది. దీంతో నిరోషాతో పాటు బాబాయ్ వరసయ్యే ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు మధిర కోర్టులో హాజరుపర్చారు. కోర్టు వారిని రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు వైరా పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే ఇలాగే అక్రమబంధానికి అడ్డుపడుతున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో కసాయి భార్య. ఈ  దారుణం గుంటూరు జిల్లాలో చోటుచచేసుకుంది. గుంటూరు జిల్లా (guntur district) నగరం మండల కాసానివారిపాలెం గ్రామానికి చెందిన కర్రి వెంకటేశ్వర రావు(37), ఆదిలక్ష్మి(30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.   

వ్యవసాయ పనులకు వెళ్లే ఆదిలక్ష్మికి బాపట్ల మండలం మూలపాలెం గ్రామనికి చెందిన బెజ్జం రాజేష్(27) తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అక్రమసంబంధానికి దారితీసింది. అయితే వీరిమధ్య సాగుతున్న అక్రమసంబంధం గురించి వెంకటేశ్వరరావుకు తెలిసి ఇద్దరినీ తీవ్రంగా మందలించాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని ఆదిలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు ప్లాన్ వేసారు. 

ఇందులో భాగంగానే వెంకటేశ్వర రావు తినే ఆహారంలో కొంగలమందు కలిపింది భార్య. ఎలాంటి అనుమానం రాకుండా ఈ విషం కలిపిన భోజనాన్ని భర్తతో తినిపించింది. ఇలా విషాహారం తిని భర్త మృతిచెందిన తర్వాత ప్రియుడు రాజేష్ కు సమాచారం ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఇంటివెనక పశువుల పాకలో మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే వీరి పాపంపండి పోలీసుల విచారణలో హత్యోదంతం బయటపడింది.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..