విషాదం.. కరీంనగర్‌లో దంపతుల ఆత్మహత్య

Siva Kodati |  
Published : Mar 05, 2022, 09:59 PM ISTUpdated : Mar 05, 2022, 10:01 PM IST
విషాదం.. కరీంనగర్‌లో దంపతుల ఆత్మహత్య

సారాంశం

కరీంనగర్‌లో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని వెంకటేశ్, భాగ్యలక్ష్మీగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.   

కరీంనగర్‌లో (karimnagar) విషాదం చోటుచేసుకుంది. నగరంలోని అశోక్ నగర్‌‌‌లో నివాసముంటున్న వెంకటేష్, భాగ్యలక్ష్మి అనే దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు (couple suicide) పాల్పడ్డారు. మార్కెట్‌ సెంటర్‌లో కిరాణా దుకాణం నడుపుకుంటూ వీరి జీవనం సాగిస్తున్నారు. అయితే రెండేళ్ల నుంచి దుకాణం సరిగ్గా నడవకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని బంధువులు చెబుతున్నారు. ఈ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. మృతులకు ఇద్దరు సంతానం. వారికి పెళ్లిళ్లు కావడంతో దూరప్రాంతాల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని  పరిశీలించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu