హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఖమ్మం జిల్లా కలెక్టర్

By Siva KodatiFirst Published Mar 10, 2021, 9:51 PM IST
Highlights

తెలంగాణ హైకోర్టుకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ క్షమాపణ చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ సందర్భంగా సీజే జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం ఎదుట ఆయన హాజరయ్యారు

తెలంగాణ హైకోర్టుకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ క్షమాపణ చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ సందర్భంగా సీజే జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం ఎదుట ఆయన హాజరయ్యారు.

ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న వినతి పత్రాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఖమ్మం కలెక్టర్‌ అమలు చేయలేదు. దీంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణన్‌పై కోర్టు ధిక్కరణ శిక్ష విధించారు.

దీని కింద రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి తీర్పు విషయంలో కలెక్టర్‌ దాఖలు చేసిన అప్పీలుపై ఈ బుధవారం విచారణ జరిగింది. ఆయన క్షమాపణ చెప్పడంతో కోర్టు ధిక్కరణ శిక్షను హైకోర్టు బెంచ్ రద్దు చేసింది.  

click me!