
పెద్దపల్లి: కూతురిని తీసుకుని స్కూటీపై సరదాగా బయటకు వచ్చిన ఓ ఏఎస్సై రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. లారీ రూపంలో ఆమెను మృత్యువు కబళించగా కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ దారుణం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి పట్టణంలో కుటుంబంతో కలిసి నివాసముండే కమాన్ పూర్ ఏఎఎస్సై భాగ్యలక్ష్మి గురువారం విధులకు వెళ్లే ముందు కూతురితో కలిసి స్కూటీపై బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే వీరు కమాన్ పూర్ కూడలివద్దకు రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో ఏఎస్సై భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె కూతురు స్వల్పంగా గాయపడింది.
read more కేవలం నీటి కోసం... చిన్నమ్మ, చెల్లిని గొడ్డలితో నరికిచంపిన కిరాతకుడు
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని మొదట దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం భాగ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.