హయత్‌నగర్ పాప మృతి కేసు.. ఎస్సై స్వప్న భర్తకు నోటీసులు.. అరెస్ట్ చేయకపోవడంపై పాప బంధువుల ఆగ్రహం..!!

By Sumanth KanukulaFirst Published May 25, 2023, 2:39 PM IST
Highlights

హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిద్రిస్తున్న పాప తలపై నుంచి కారు వెళ్లడంతో చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. 

హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిద్రిస్తున్న పాప తలపై నుంచి కారు వెళ్లడంతో చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. కారు నడిపిన హరిరామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత అతడికి సీఆర్‌పీసీ 41 నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే హరిరామకృష్ణ భార్య స్వప్న ఎస్సైగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అతడిపై చర్యలు తీసుకోవడం లేదని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరిరామకృష్ణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అక్కడ పాప ఉంది తాను చూసుకోలేదని హరిరామకృష్ణ చెబుతున్నాడు.  

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన కవిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు.  నగరంలో కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్నారు. హయత్ నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో శ్లాబు పనులు చేస్తున్నారు. తమతోపాటు తీసుకెళ్లిన కూతురు లక్ష్మీ నిద్రపోవడంతో కవిత చిన్నారిని నీడ కోసం పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేస్ లో పడుకోబెట్టింది. ఆ తర్వాత పనిలో నిమగ్నమైంది.

అయితే అపార్ట్ మెంట్‌లో నివసించే హరిరామకృష్ణ  తన కారును పార్క్ చేయడానికి సెల్లార్‌లోకి వెళ్లాడు. తనకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్ లో పాప నిద్రిస్తుందన్న విషయాన్ని గమనించని అతను కారును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో కారు ముందు టైర్ పాప తలపై నుంచి వెళ్లింది. దీంతో వెంటనే కారును వెనక్కి తీసినప్పటికీ పాప తీవ్రంగా గాయపడ్డారు. అది ఈ విషయం తెలిసి కవిత కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే చిన్నారిని  ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే పాప మృతిచెందింది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

click me!