కోదండరాం కట్టడికి కేసిఆర్  కొత్త ఫార్ములా

Published : Jun 15, 2017, 06:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కోదండరాం కట్టడికి కేసిఆర్  కొత్త ఫార్ములా

సారాంశం

తెంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం పై దాడికి కెసిఆర్ సర్కారు కొత్త వ్యూహం అమలు చేస్తున్నది. కోదండరాం ఏం  మాట్లాడినా కొత్త ఫార్ములా ప్రకారమే విమర్శలు గుప్పిస్తోంది. సర్కారుపై కోదండ ఎలాంటి అంశాలు లేవనెత్తినా వాటికి సమాధానం చెప్పకుండా అదే దారిలో సాగుతోంది.

ఇంతకూ కెసిఆర్ సర్కారు కొత్త ఫార్ములా  ఏంటో అనుకుంటున్నారా? ఇది చదవండి. ఇంతకాలం  కోదందరాం విమర్శలపై తెలంగాణ సర్కారు పలు రకాలుగా స్పందించింది. అవసరమైతే... కోదండరాం తమ సర్కారును బదనాం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. అలాగే... విపక్షాల మౌత్ పీస్ గా కోదండరాం మారిపోయారని  అన్నారు. అంతే కాకుండా తెలంగాణ ద్రోహులతో కోదండరాం జత కలిశారు అని విమర్శించారు. కానీ ఇప్పుడు సింగిల్ ఎజెండా కోదండ రాం ఏది మాట్లాడినా ఆయన కాంగ్రెస్ ఏజెంటు  అన్నదే ప్రచారం చేయాలని డిసైడ్ అయింది కెసిఆర్ సర్కారు.

 

 

ఇకనుంచి కోదండరాంను కాంగ్రెస్ నేతగానే పరిగణించి ఆయనపై కాంగ్రెస్ ముద్ర మరింత గట్టిగా  వేయాలని టిఆర్ఎస్  సర్కారు భావిస్తోంది. కోదండరాం ఏది మాట్లాడినా, ఏ ప్రజాసమస్య  లేవనెత్తినా కాంగ్రెస్ ఏజెంట్ అంటూ విమర్శలు గుప్పంచనుంది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు ఆ దిశగా కొత్త ఫార్ములాను అమలు చేశారు. భూముల విషయంలో తెలంగాణ సర్కారు కంపు కొడుతోందని కోదండరాం చేసిన వ్యాఖ్యలపై హరీష్ స్పందన అలాగే ఉంది. పీల్చే ముక్కును బట్టి కంపు ఉంటది కోదండరాం గారూ అంటూ హరీష్ రావు సంబోధించారు. కోదండరాం  కాంగ్రెస్ ముక్కుతో వాసన పీల్చుతున్నారన్నది హరీష్ విమర్శ.

 

 

నిజానికి కోదండరాంపై విమర్శలు చేయడానికైనా... ఆయన విమర్శలకు సమాధానం  చెప్పడానికైనా ప్రభుత్వం వద్ద  బలమైన అస్త్రాలేవీ లేవనే చెప్పాలి.  ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీల మీద విరుచుకుపడినట్లు  కోదండరాంపై విరుచుకుపడడం అధికారపార్టీకి సాధ్యం కాని  విషయం. అందుకే కోదండను టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీతో లింకు పెడుతూ విమర్శలు గుప్పించాలని నిర్ణయించింది సర్కారు.

 

 

మరోవైపు సర్కారు విమర్శలు డోంట్ కేర్ అంటూ కోదండరాం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అనుక్షణం జనాల్లోకి వెళ్తూ సర్కారుపై అంశాల వారీగా తప్పుప్పులను లేవనెత్తుతున్నారు. రాజకీయ విమర్శలకు తావు  లేకుండా ఆయన ప్రజా సమస్యలపై మాత్రమే సూటిగా ప్రశ్నిస్తున్నారు. అమర వీరుల స్పూర్తి యాత్రకు రూపకల్పన చేశారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. తొలి విడత యాత్ర త్వరలోనే షురూ కానుంది. తనకున్న పరిమిత వనరులతోనే ఆయన ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తున్నరు.

 

 

మరి కోదండరాంపై కెసిఆర్ సర్కారు సింగిల్ ఫార్ములా ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu