
భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ వేడుకకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితి.
సీఎం కేసీఆర్ అయితే తన కుటుంబం తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు.
బుధవారం భద్రాద్రిలో జరిగిన కల్యాణ వేడుకకు అనారోగ్యం కారణంగా ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన తరఫున రాములోరికి పట్టువస్త్రాలను కేసీఆర్ మనవడు హిమాన్షు పట్టువస్త్రాలను సమర్పించారు.
కాగా, ప్రభుత‍్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణ వేడుకలో పాల్గొన్నారు.
కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు.