రెడ్డిల చెవిలో కేసిఆర్ గులాబీ పువ్వు

First Published Aug 22, 2017, 6:32 PM IST
Highlights
  • కిరణ్ కాలంలో చేసిన పనిని తానే చేశానని చెప్పుకున్న కెసిఆర్
  • రెడ్డీ హాస్టల్ సభలో కెసిఆర్ చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం
  • అప్పా పేరు మార్పు తామే చేశామన్న కెసిఆర్

తెలంగాణ సిఎం కెసిఆర్ రెడ్డి హాస్టల్ పేరుతో ఆ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఆర్భాటంగా రెడ్డి హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ల కోరికలు అన్నీ వెంటనే తీర్చేశారు. కోరిన కోర్కెలతోపాటు కోరని కోర్కెలు కూడా తీర్చేశారు సిఎం గారు. దీంతో కెసిఆర్ కు రెడ్డీలంతా రుణపడి ఉంటారని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి సభలో ఘనంగా ప్రకటించారు.

కానీ రెడ్డీల కోరని కోర్కెలు తీర్చినట్లు సిఎం సభలో చెప్పుకున్నారు. రాజేంద్రనగర్ లో ఉన్న పోలీసు ట్రైనింగ్ కేంద్రం ఎపి పోలీసు అకాడమీని అప్పా అంటారు. అప్ప పప్పా పేరు బాగాలేదని దాని పేరును అధికారంలోకి రాగానే మార్చేశాం అని కెసిఆర్ సభలో ప్రకటించారు. అప్ప పేరేంది చెండాలంగా పాడుబడ్డది అందుకనే దాని పేరు రాజా బహుదూర్ వెంకటరామారెడ్డి పోలీసు ట్రైనింగ్ అకాడమీగా మార్చినం. అని కెసిఆర్ సభలో ప్రకటించారు. దీంతో సభలో ఉన్నవారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

కానీ సీన్ కట్ చేస్తే ఈ అప్పా పేరు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న కాలంలోనే మారిపోయింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సిఎం కిరణ్ కాలంలో 2013లోనే మార్చి 14వ తేదీన మార్చారు. ఆనాడే రాజా బహుదూర్ వెంకటరామారెడ్డి పోలీసు ట్రైనింగ్ అకాడమీగా మారిపోయింది.

కానీ ఆ మార్పును తమ సర్కారే చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించడం సభికులు అభినండించడం జరిగిపోయాయి. కానీ సోషల్ మీడియా ఊరుకోదు కదా? ఆనాడు ఉమ్మడి సర్కారు వెలువరించిన జిఓ కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ వార్త ఇప్పుడు వైలర్ అయింది.

ఎంతైనా సిఎం కెసిఆర్ ఒకసారి ఆ ప్రకటనలు ఇచ్చేముందు చెక్ చేసుంటే మంచిది కదా? అవగాహన లేని ప్రజాసంబంధాల అధికారుల మీద, అవగాహనలోపంతో ఉన్న అధికారుల మీద ఎందుకు ఆధారపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు టిఆర్ఎస్ నేతలు.

click me!