తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురు దెబ్బ

First Published Apr 17, 2017, 9:26 AM IST
Highlights

సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సుప్రీం నో

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సింగరేణి లో వారసత్వ నియామకాలకు పచ్చాజెండా ఊపుతూ నిర్ణయం తీసుకుంది.

అయితే రవి అనే వ్యక్తి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హై కోర్టును ఆశ్రయించాడు. దీంతోసింగరేణి వారసత్వ నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పునిచ్చింది.

 

దీనిపై మళ్లీ చర్చించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.సుప్రీం కోర్టు కూడా.. వారసత్వ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది.  ఈ తీర్పుతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లైంది.

click me!