వరిపై కేంద్రంపై టీఆర్ఎస్‌ పోరు: రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన, పాల్గొననున్న కేసీఆర్

Published : Apr 10, 2022, 11:14 AM ISTUpdated : Apr 10, 2022, 11:17 AM IST
వరిపై కేంద్రంపై టీఆర్ఎస్‌ పోరు: రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన, పాల్గొననున్న కేసీఆర్

సారాంశం

వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ తో ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయనున్నారు.ఈ దీక్షలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొంటారు.ఈ దీక్షలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు.

న్యూఢిల్లీ: Paddy ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో  TRS ఈ నెల 11న New Delhi లోని తెలంగాణ భవన్ లో నిరసన దీక్ష చేయనుంది.ఈ దీక్షలో తెలంగాణ సీఎం KCR  కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఈ నెల 4వ తేదీ నుండి వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తుంది. రేపటి ఆందోళనలతో  తొలి విడత ఆందోళనలు ముగియనున్నాయి. 

ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ నెల 6న జాతీయ రహదారులను దిగ్భంధించారు.ఈ నెల 7న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్లను ముట్టడించారు. ఈ నెల 8న వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసనకు దిగారు. ఈ నెల 11న  ఢిల్లీలో టీఆర్ఎస్ ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. 

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నిరసన దీక్షలకు దిగనుంది. ఈ దీక్షలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు.  ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నిరసన దీక్ష ఏర్పాట్లను ఎమ్మెల్సీ Kavitha ఆదివారం నాడు పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్రంలో  యాసంగిలో వరి ధాన్యం  పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay వరి ధాన్యం పండించాలని రైతును రెచ్చగొట్టారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రైతులు వరి ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని కూడా చెప్పారని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.  వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ చేసిన ఆందోళనల కార్యక్రమాల సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రకటనలను కూడా టీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు. సంజయ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను కూడా ప్రదర్శించారు.

Parliament ఉభయ సభల్లో వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ ను టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తారు. వాయిదా తీర్మాణాలు, ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ప్రస్తావించారు. అయితే రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  టీఆర్ఎస్  లేవనెత్తిన ఈ అంశంపై సమాధానం ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ఏ రకమైన విధానాలను అవలంభిస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా   అదే  విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తుందని కూడాPiyush Goyal చెప్పారు. పీయూష్ గోయల్ ప్రకటనపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. పీయూష్ గోయల్  ప్రజలతో పాటు చట్ట సభలను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది.

విదేశాలకు Boiled Rice ను ఎగుమతి చేస్తున్నా కూడా రాజ్యసభను తప్పుదోవ పట్టించేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుడు ప్రకటన చేశారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నేతలు ఆయనపై  ప్రివిలేజ్ మోషన్ నోటీసు కూడా ఇచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?