ఈటెల రాజేందర్ కు కెసిఆర్ భారీ నజరానా

First Published Apr 15, 2017, 10:19 AM IST
Highlights

ఈటెల జమునా రెడ్డి నాయకత్వంలో  రాజేందర్ కు ఏమాత్రం తీసిపోదని మాజీ పిడిఎస్ యు నాయకులు చెబుతారు. దానికితోడు ఆమె రెడ్డి కులం నుంచి వచ్చారు. హూజూరాబాద్ లో రెడ్ల ప్రాబల్యం బాగా ఉన్నందున రాజేందర్ కు బదులు ఆమెను రంగంలోకి దించే అవకాశం ఉందట

పనితీరులో నెంబర్ వన్ అనిపించుకున్న తెలంగాణా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ భారీ నజరానా అందివ్వబోతున్నారు. తెలంగాణా మీడియా కథనాల ప్రకారం , రాజేందర్ భార్య జమునా రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇవ్వబోతున్నారు.  ఆమె టిఆర్ ఎస్ అభ్యర్థిగా  2019లో హూజూరాబాద్ నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి.

 

ఈటల రాజేందర్ విద్యార్థి దశలో విప్ల వ రాజకీయాలలో ఉండేవారు. ఆయన భార జమునా రెడ్డి కూడా పిడిఎస్ యు నాయకురాలు. కాబట్టి మాట్లాడటంలో, నాయకత్వంలో  రాజేందర్ కు ఏమాత్రం తీసిపోదని మాజీ పిడిఎస్ యు నాయకులు చెబుతారు. దానికితోడు ఆమె రెడ్డి కులం నుంచి వచ్చారు. హూజూరాబాద్ లో రెడ్ల ప్రాబల్యం బాగా ఉన్నందున రాజేందర్ కు బదులు ఆమెను రంగంలోకి దించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

మంత్రిగా, పార్టీ నాయకుడిగా వివాదరహితంగా ఉండటమేకాదు, పనితీరులో బేష్ అనిపించుకున్న రాజేందర్ కిది ఒక బహుమానం అని అంటున్నారు. అంటే రాజేందర్ కుటుంబానికి అదనంగా ఒక అసెంబ్లీ సీటు లభిస్తుంది. మరి మంత్రి ఎక్కడి నుంచి పోటీచేస్తారు?

 

ఆయనను హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గానికి బదిలీచేసే అవకాశం ఉందని మీడియా కథనం.

 

click me!