వచ్చే ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీకి పోటీ చేశారు. కానీ ఈ దఫా మాత్రం రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు.
హైదరాబాద్:వచ్చే ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి కూడ కేసీఆర్ పోటీ చేయనున్నారు.
2014 ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ పోటీ చేశారు.ఈ రెండు స్థానాల్లో కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. కేసీఆర్ రాజీనామాతో మెదక్ పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరిగింది.ఆ సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డిని మెదక్ నుండి బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఈ స్థానం నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2019 ఎంపీ ఎన్నికల్లో కూడ కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఈ దఫా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడ దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు. దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2018లో దుబ్బాక నుండి విజయం సాధించిన రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించారు.దీంతో జరిగిన ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణిపై బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు గెలుపొందారు.
ఇదిలా ఉంటే ఈ దఫా గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాల నుండి కేసీఆర్ బరిలోకి దిగనున్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కేసీఆర్ స్వగ్రామం ఉంటుంది. కేసీఆర్ పూర్వీకుల గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా తమ భూములు కోల్పోవడంతో కేసీఆర్ కుటుంబం ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడకకు చేరుకుంది.
also read:ములుగులో సీతక్కపై మహిళ అభ్యర్థిని దింపిన బీఆర్ఎస్: ఎవరీ నాగజ్యోతి?
దీంతో తన స్వగ్రామం ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడ కేసీఆర్ ను కోరారు. కామారెడ్డి నియోజకవర్గం నుండి టీడీపీ నుండి ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్ధిగా గంప గోవర్ధన్ విజయం సాధించారు. 2009లో కామారెడ్డి నుండి భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థిగా గంప గోవర్ధన్ విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.