క‌ృష్ణ మాదిగకు ఇక కష్టకాలమే...

Published : Nov 02, 2016, 10:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
క‌ృష్ణ మాదిగకు ఇక కష్టకాలమే...

సారాంశం

మాదిగలను  ఆకట్టుకునేందుకు టిఆర్ ఎస్ ప్రయత్నాలు  మొదలుపెట్టింది. ఎంఆర్ పి ఎస్ నాయకుడు కృష్ణ మాదిగ  ’ధర్మ యుద్ధా’నికి పోటీగా నవంబర్ 14 న టిఆర్ ఎస్ అనుకూల మాదిగ జెఎసి బహిరంగ సభ    

ప్రతిపక్ష పార్టీలనుచావు దెబ్బతీసిన ముఖ్యమంత్రి కెసిఆర్  తెలంగాణాలో బలమయిన వర్గంగా ఉన్న మాదిగలను సమీకరించేందుకు పూనుకుంటున్నట్లుంది.మాదిగలు తెలంగాణాలో బలమయిన రాజకీయ శక్తి.  అనేక ఉద్యమాలు చేసి ఒక సంఘటిత శక్తిగా ఎదిగిన కులం మాదిగలు.  ఎస్ సి రిజర్వేషన్లను ఎబిసిడి లుగా వర్గీకరించాలని మాదిగలు కృష్ణ మాదిగ నాయకత్వంలో చేసిన పోరాటానికి జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ ఉద్యమం తర్వాత,  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి  తర్వాత చీలిపోయివుండవచ్చు, వారొక సంఘటిత శక్తిగా ఎదిగారన్నది మాత్రం రుజువయింది.  దీని ఫలితంగా ఎన్నికలపుడు టికెట్స్ ఇచ్చేందుకు, ఇతర పదవు పందేరం జరిపేటపుడు మాదిగలను విస్మరించ లేని పరిస్థితిని ఎంఆర్ పిఎస్ తీసుకువచ్చింది. దీనికి కారణం మంద కృష్ణ మాదిగయే అనక తప్పదు. రాజకీయల పార్టీలకు బయట ఒక గణనీయ శక్తిగా ఎదిగ ఏకైక నాయకుడు కష్ణ మాదిగ. బిసి నాయకుడిగా కృష్ణయ్య కూడా ఇదే విధంగా స్వతంత్రంగా ఎదిగినా 2014 లో  ఆయన టిడిపి లో చేరిపోయారు. క‌ృష్ణ మాత్రం పార్టీలకు బయటే ఉంటున్నారు.

అయితే, వ్యహాత్మకంగా కృష్ణ మాదిగ రాజకీయ  పార్టీలతో, నాయకులతో చేసిన స్నేహం ఆయనకు బాగా చెడ్డ పేరు తీసుకువచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును వర్గీకరణ విషయంలో, ఆశా వర్కర్ల విషయంలో తీవ్రంగా విమర్శించిన నాయకుడు. ఎస్సి వర్గీకరణ విషయంలో తాను అఖిల పక్షాన్నిఢిల్లీ కి తీసుకువెళతానని ఒక్క మాటకు కూడా అనలేదని చెబుతూ  ఎన్నికలలో టిఆర్ ఎస్ వ్యతిరేకంగా  ప్రచారం చేశారు. ఇపుడు మాదిగలను ఎంఆర్ పిఎస్ నుంచి టిఆర్ ఎస్ వైపు లాగేందుకు ముఖ్యమంత్రి వ్యూహం పన్నినట్లుంది. అందుకే  మాదిగ జెఎసి  ని రంగం మీదకు తెస్తున్నారు.

 

’ధర్మయుద్ధం’ పేరుతో వర్గీకరణ  కోసం నవంబర్ 27న హైదరాబాద్ లో కృష్ణ మాదిగ క బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 

అయితే, తెరాస సహకారంలో ఇపుడు కృష్ణ మాదిగకు పోటీగా మాదిగ జెఎసి నాయకులు  నవంబర్ 14 న బహిరంగ సభ నిర్శహించాలనుకుంటున్నారు. అనుమతి కోసం  పోలీసులకు దరఖాస్తు కూడ చేశారు. ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తో జరుపుతున్న ఈ సభకు  31 జిల్లాల నుంచి మాదిగలను సమీకరించేందుకు చురుకుగా ఏర్పాట్లు మొదలయ్యాయి. దాదాపు లక్ష మందిని సమీకరించేందుకు కృషి చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడుతూ ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా మాదిగల మహాసభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రకటించారు. ఈ సభకు ప్రముఖ మాదిగ నాయకుడు ,ఉప ముఖ్యమంత్రి  కడియం శ్రీహరి ముఖ్యఅతిధిగా హాజరవుతారు.

 

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు