మంత్రి మల్లారెడ్డి, శరత్ చంద్రారెడ్డి మధ్య గొడవ: రంగంలోకి దిగిన కేసీఆర్

By telugu teamFirst Published Sep 25, 2021, 8:52 AM IST
Highlights

టీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డికి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి మధ్య చెలరేగిన వివాదాన్ని పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. విభేదాలు కట్టిపెట్టి పార్టీ కోసం పనిచేయాలని వారికి సూచించారు.

హైదరాబాద్: మంత్రి సిహెచ్. మల్లారెడ్డికి, మేడ్చెల్ - మల్కాజిగిరి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు స్వయంగా రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో మల్లారెడ్డి వైఖరిని నిరసిస్తూ శరత్ చంద్రారెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో వివాదం పరిష్కరానికి కేసీఆర్ నడుం బిగించారు. 

ఇరువురు నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. విభేదాలను పక్కన పెట్టి, పార్టీకోసం పనిచేయాలని ఇరువురు నాయకులకు ఆయన సూచించారు. శుక్రవారం శాసనసభా సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్ మల్లారెడ్డిని, శరత్ చంద్రారెడ్డిని, శరత్ చంద్రారెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని తన ఛేంబర్ కు పిలిపించుకున్నారు. 

Also Read: కేటీఆర్ కు తలనొప్పి: మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు, రాజీనామాకు జడ్పీ చైర్మన్ రెడీ

విభేదాలను పక్కన పెట్టాలని, బహిరంగ విమర్శలు మానుకోవాలని కేసీఆర్ వారిని ఆదేశించారు. వివాదాన్ని పరిష్కరించాలని అంతకు కేసీఆర్ తన కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు సూచించారు. మల్లారెడ్డి మేడ్చెల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు 2014-2018 మధ్యకాలంలో సుధీర్ రెడ్డి మేడ్చెల్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్య వహించారు. 

గత సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి మల్లారెడ్డికి మేడ్చెల్ పార్టీ టికెట్ ఇచ్చారు. మల్లారెడ్డి విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. అప్పటి నుంచే మల్లారెడ్డికి, సుధీర్ రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో సుధీర్ రెడ్డి కుమారుడు శరత్ చంద్రారెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారు. 

click me!