కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై అమిత్ షా రేపటి సభలో సమాధానం చెప్పాలి.. సీఎం కేసీఆర్

By Sumanth KanukulaFirst Published Aug 20, 2022, 4:36 PM IST
Highlights

గతంలో ఏ ప్రభుత్వం కూడా మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధపడిందో అందరం చూశామని అన్నారు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందలేదని అన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం కూడా మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధపడిందో అందరం చూశామని అన్నారు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందలేదని అన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ జలాల ద్వారా జీరో ఫ్లోర్లైడ్ జిల్లాగా మార్చామని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్‌గా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిందని చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినప్పటికీ అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. ఫ్లోరైడ్ బాధితుడుని ఢిల్లీ తీసుకెళ్లి చూపించినా ఎవరూ కూడా మన మొర తీర్చలేదని చెప్పారు. 

మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ అని.. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు. ఇక్కడ ఉప ఎన్నిక ఎందుకు జరుగుతుందో తెలసుకోకపోతే దెబ్బతినే అవకాశం ఉందన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా... ఇప్పుడే ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఎవరి కోసం ఉప ఎన్నిక అని ప్రశ్నించారు. మునుగోడులో గోల్‌మాల్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. 

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి రేపు మునుగోడులో సమాధానం చెప్పాలని అమిత్ షాను అడుగుతున్నానని చెప్పారు. విభజన చట్టం ప్రకారం రావాల్సినవి తెలంగాణకు రాలేదని అన్నారు.  కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటాపై రేపు మునుగోడు సభలో అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. బ్యాంకు, రైళ్లు, రోడ్లు అన్నింటికి కేంద్రం అమ్మేస్తుందని ఆరోపించారు.

మునుగోడులో తమకు మద్దతిచ్చిన సీపీఐకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కామ్రేడ్లతో కలిసి రావాలని కోరినట్టుగా చెప్పారు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా కామ్రేడ్లతో ఐక్యత కొనసాగాలన్నారు. 

click me!