
ఒకప్పుడు ఎడారిగా మారుతుందన్న జిల్లాను.. కేసీఆర్ సస్యశ్యామలంగా చేశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ వేదికపై నుంచి జగదీష్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసీని సీఎం కేసీఆర్ పారదోలారని అన్నారు. గతంలో కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా నల్గొండ ఫ్లోరైడ్ రక్కసీ గురించి చెప్పేవారు. 20 ఏళ్ల కిందటే కేసీఆర్ ఈ సమస్య పరిష్కారానికి ఆలోచించేవారని చెప్పారు. 2014కు ముందు మునుగోడులో దీన పరిస్థితులు ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలు చూస్తున్నారని అన్నారు. మోదీతో , బీజేపీతో కోట్లాలో టీఆర్ఎస్‌తో కలిసివస్తామని చెప్పిన సీపీఎం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక, కొద్దిసేపటి క్రితం మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ ప్రారంభం అయింది. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. మునుగోడులో ప్రజాదీవెన సభ వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు. వేదికపై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.