TRS Plenary మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం: బీజేపీపై కేసీఆర్ ఫైర్

Published : Apr 27, 2022, 01:00 PM IST
TRS Plenary  మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం: బీజేపీపై కేసీఆర్ ఫైర్

సారాంశం

మత విద్వేషాలు  రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ  ప్రయత్నాలు చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

హైదరాబాద్: జితిపిత Mahatma Gandhi ని అవమానపరుస్తారా అని తెలంగాణ సీఎం KCR  ప్రశ్నించారు. గాంధీని చంపిన  వ్యక్తిని పూజిస్తారా? అని కేసీఆర్ అడిగారు. ఏ దేశమైనా ఇలా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.బుధవారం నాడు హైద్రాబాద్ హైటెక్స్ హెచ్ ఐసీసీ లో జరిగిన TRS Plemay లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అంతకు ముందు ఆయన  పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 

దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాలపై ప్రజల మధ్య చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. ఏం ఆశించి ప్రజల మధ్య విధ్వేషం రగులుస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు.ఈ దేశాన్ని ఎటువైపునకు తీసుకెళ్తున్నారని ఆయన అడిగారు.ఏ రకమైన మత పిచ్చిని ప్రేరేపిస్తున్నారని  ప్రశ్నించారు. ఇది మంచిదేనా అని కేసీఆర్ అడిగారు. కుత్సిత బుద్దితో కుటిల రాజకీయం చేస్తే పది మందికి పది పదవులు వస్తాయన్నారు. విధ్వంసం చేయడం చాలా తేలికన్నారు. కానీ నిర్మించడం చాలా కష్టమని కేసీఆర్ చెప్పారు.

Karnataka  రాష్ట్రంలోని Banglore ను సిలీకాన్ వ్యాలీగా పిలుస్తారన్నారు. 30 లక్షల మందికి ఇక్కడ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  ఉపాధి లభ్యమౌతోందన్నారు.ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని దశాబ్దాలు కష్టపడితే ఆ రాష్ట్రం ఆస్థాయిలో ఉందో ఊహించగలమా అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతుందని ఆయన అడిగారు.

Hijab, హలాల్, పూలు , పండ్లు కొనుగోలు చేయవద్దనే గొడవలు జరుగుతున్నాయన్నారు.ఏ వృత్తినైనా ఎవరైనా చేయవద్చన్నారు దీనికి కులం, మతం అనే తేడా అవసరం లేదని చెప్పారు.  13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. విదేశాల్లో ఉన్న వారిని కూడా ఆయా దేశాల్లో ఉన్న వారిని ఇండియాకు పంపిస్తే  13 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. కువైట్ కు చెందిన కొందరు ఎంపీలు ఆ ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఇండియాకు చెందిన వారిని ఇక్కడ ఉంచాలా ఇండియాకు పంపించాలో ఆలోచించాలని ప్రభుత్వాన్ని  కోరారు. ఏం ఆశించి ఈ దుర్మార్గాన్ని రెచ్చగొడుతున్నారని కేసీఆర్ అడిగారు. దేశం అన్ని రంగాల్లో నాశనం అయిందని కేసీఆర్ విమర్శించారు. గతంలో ఉన్న సర్కారే బాగుండేదని ప్రజలు అనుకొనే స్థాయికి ప్రస్తుత బీజేపీ పాలన ఉందన్నారు. నిరుద్యోగం, ఆకలి పెరిగిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని కేసీఆర్ చెప్పారు.  ప్రజల సమస్యపై కేంద్రానికి దృష్టి లేదన్నారు. ప్రజల మధ్య విద్వేషం, ద్వేషం రగిల్చి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. 

పూల్వామా, సర్జికల్ స్ట్రైక్స్, కాశ్మీర్ ఫైల్స్ వంటి వాటిని తెర మీదికి తీసుకొచ్చి  రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.  ఐటీలో బెంగుళూరు తర్వాత తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు.  దేశ రాజధానిలో దేవుడి  ర్యాలీలో కత్తులు, తుపాకులు పట్టుకొని ర్యాలీలు చేస్తారా అని కేసీఆర్ మండిపడ్డారు. మహాత్ముడు ఈ దేశం కోసం కలలు గన్నాడా అని కేసీఆర్ ప్రశ్నించారు.  దేశానికి మంచి మార్గాన్ని చూపేందుకు మనం కూడా మన శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్