రేవంత్ బర్త్ డే కు కేసిఆర్ గిఫ్ట్ ఏందంటే?

Published : Nov 12, 2017, 04:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
రేవంత్ బర్త్ డే కు కేసిఆర్ గిఫ్ట్ ఏందంటే?

సారాంశం

రేవంత్ కు బర్త్ డే సందర్భంగా కేసిఆర్ బహుమతి రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో రాజకీయ శత్రువులు కూడా ఉంటారు. తాజా రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే శత్రువులే ఎక్కువగా వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లో హుందాతనం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక అడుగు ముందుకేశారు.

ఈనెల 8వ తేదీన టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం జరిగింది. రేవంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ సిఎం కేసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖను, గులాబీ పూల బొకేను పంపించారు.

గతంలో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత జానారెడ్డి ల బర్త్ డే లు ఒకేరోజు ఉన్నాయి. వారి బర్త్ డే నాడు కూడా ఇద్దరికి ఇదేరీతిలో సిఎం కేసిఆర్ పూల బొకేలు, శుభాకాంక్షల లేఖలు పంపించారు. రేవంత్ విషయంలో కూడా ఇదే సాంప్రదాయాన్ని సిఎం కేసిఆర్ కొనసాగించారు.

రాజకీయ వర్గాల్లో ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సిఎం కేసిఆర్ మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని పలువురు అభినందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu