టిడిపి రమణపై ఘాటుగా స్పందించిన రేవంత్

First Published Nov 11, 2017, 5:26 PM IST
Highlights
  • నా యుద్ధం కేసిఆర్ మీదే.. కూలీల మీద కాదు
  • టిఆర్ఎస్ లో చేరేవాళ్ల గురించి రమణ ఎందుకు మాట్లాడడు
  • చంద్రబాబుకు అన్నీ చెప్పే వచ్చిన

టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి నాయకుడి స్థాయి నుంచి కార్యకర్త స్థాయికి దిగజారిపోయిండని  ఇప్పటికే రమణ రేవంత్ పై విమర్శలు గుప్పించారు. దానికి రేవంత్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆ వివరాలు చూద్దాం.

రాజకీయంగా నా ఎత్తుగడ నాకుంది. డిసెంబర్ 9న మీట్ ది ప్రెస్ ఏర్పాటు చేశారు. దానిలో పాల్గొంటా. ఆ తరువాత కెసిఆర్ ఆలోచనలన్నీ నా చుట్టే తిరుగుతాయి. నాతో పాటు పార్టీ మారమని ఏ ఒక్క నాయకున్ని నేను అడగలేదు. నేను చెప్పాలనుకున్నది చంద్రబాబు కి చెప్పే వచ్చాను.

టీడీపీ లో ఉంటూ కేసీఆర్ కు ఉపాది కూలీ పని చేస్తున్నవారికి. నేను చెప్పాల్సింది ఎమీ లేదు. కంచర్ల భూపాల్ రెడ్డి టీఆరెస్ లో చేరితే ఎల్ రమణ ఎందుకు మాట్లాడలేదు? ఎల్ రమణ కేసీఆర్ దగ్గర ఉపాధి హామీ కూలి డబ్బు తెచ్చుకుని నాపై విమర్శలు చేస్తున్నాడు. ఈ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు.

కొడంగల్ లో మీటింగ్ పెడతా అంటున్న ఎల్ రమణ .. గజ్వేల్, సిద్ధిపేట్ లో మీటింగ్ పెడుతా అని ఎందుకు చెప్పడం లేదు? చేరాలనుకుంటే ముసుగు తీసి నేరుగా టిఆర్ ఎస్ లో ఎల్.రమణ చెరొచ్చు కదా? టిఆర్ఎస్ ముసుగులో టీడీపీ లో పని చేస్తున్నాడు ఎల్ రమణ.

టీడీపీ లో వున్న నేతలందరిని టిఆర్ఎస్ లో చేర్చే వరకు రమణ టిఆర్ఎష్ తీర్థం పుచ్చుకోడు. నాకు కేసీఆర్ ఉపాధి కూలీ ఎల్ రమణ సర్టిఫికెట్ అవసరం లేనే లేదు. చేతనైతే సొంత నియోజకవర్గం లో మీటింగ్ పెట్టుకుని గెలవాలి ఎల్  రమణ. కేసీఆర్ కూలీల పై కాదు.. కెసిఆర్ పైనే నా యుద్ధం అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

 

click me!