కేబినెట్‌లో బెర్త్ ఖాయం:ఆ నేతలకు కేసీఆర్ హామీ?

By narsimha lodeFirst Published Jan 2, 2019, 8:53 PM IST
Highlights

ప్రాజెక్టుల బాటలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌తో కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో జోష్ కన్పిస్తోంది. కేబినెట్‌లో తమకు అవకాశం దక్కుతోందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 
 


కరీంనగర్: ప్రాజెక్టుల బాటలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌తో కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో జోష్ కన్పిస్తోంది. కేబినెట్‌లో తమకు అవకాశం దక్కుతోందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 

గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో  ప్రాజెక్టుల బాటలో భాగంగా సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేసీఆర్ తో భేటీ అయ్యారు.

జనవరి ఒకటో తేదీన సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే బస చేశారు. ఈ సమయంలోనే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులతో ఆయన ముఖా ముఖి మాట్లాడారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కేటీఆర్‌తో పాటు ఈటల రాజేందర్ ‌కు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ కు స్పీకర్ పదవిని కూడ ఇస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. దీంతో  తనకు స్పీకర్ పదవి ఇవ్వకూడదని నిన్న కేసీఆర్ తో ముఖాముఖి కలిసిన సమయంలో ఈటల చెప్పినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ధర్మపురి నుండి మరో సారి విజయం సాధించిన కొప్పుల ఈశ్వర్ కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాత ఆయన సంతోషంగా కన్పించారని పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గంలో  కొప్పుల ఈశ్వర్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

 గత టర్మ్‌లోనే కొప్పులకు మంత్రి పదవి ఇస్తానన్న హమీని కేసీఆర్ నిలుపుకోలేదు. అయితే కేబినెట్ హోదా కలిగిన విప్ పదవిని ఇచ్చారు. గత టర్మ్‌లో మంత్రి పదవి దక్కనందున ఈ దఫా మంత్రి పదవి తప్పకుండా వస్తోందనే ధీమాతో ఈశ్వర్ ఉన్నారు. కేసీఆర్ తో భేటీ తర్వాత ఈశ్వర్ ముఖంలో సంతోషంగా కన్పించడం వెనుక పార్టీ అధినేత నుండి స్పష్టమైన హామీ లభించిందనే ప్రచారం కూడ సాగుతోంది.

ఈ జిల్లా నుండి  వరుసగా నాలుగు దఫాలు విజయం సాధించిన విద్యాసాగర్ రావు కూడ మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఓడించిన డాక్టర్ సంజయ్ కూడ మంత్రి పదవి దక్కుతోందనే ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు కూడ ఎంపీ కవిత సిఫారసుతో  మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

కరీంనగర్ నుండి మూడో దఫా విజయం సాధించిన గంగుల కమలాకర్ కూడ  మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే కేసీఆర్ నుండి గంగుల కమలాకర్ కు కేసీఆర్ నుండి  ఖచ్చితమైన హామీ రాలేదనే ప్రచారం కూడ లేకపోలేదు. 

అయితే కేసీఆర్ తో భేటీ తర్వాత కొందరు నేతలు సంతోషంగా ఉండడం కేబినెట్ బెర్త్‌లపై ఆశలను కల్గిస్తోంది. కేసీఆర్ హామీ పొందిన నేతల్లో ఎవరెవరికీ తొలి విడతల్లో, మలి విడతల్లో అవకాశం దక్కనుందో నెల రోజుల్లో తేలనుంది.

సంబంధిత వార్తలు

ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఆ ఎనిమిది మంది వీరే

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా

click me!