రాజకీయాల్లో రావడానికి కేటీఆరే స్పూర్తి: ప్రకాష్ రాజ్

Published : Jan 02, 2019, 07:54 PM IST
రాజకీయాల్లో రావడానికి కేటీఆరే స్పూర్తి: ప్రకాష్ రాజ్

సారాంశం

తన రాజకీయ ప్రయాణానికి కేటీఆర్ స్పూర్తి అని  సినీ నటుడు ప్రకాష్ రాజ్  స్పష్టం చేశారు.

హైదరాబాద్: తన రాజకీయ ప్రయాణానికి కేటీఆర్ స్పూర్తి అని  సినీ నటుడు ప్రకాష్ రాజ్  స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో  రాజకీయాల్లోకి వస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన మరునాడే  సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం నాడు హైద్రాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.తన రాజకీయ ప్రయాణం ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని ఆయన  తేల్చి చెప్పారు. గతంలో కేసీఆర్‌తో కలిసి ప్రకాష్ రాజ్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడలను కలిశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై ప్రకాష్ రాజ్ గతంలో పలుమార్లు ప్రశంసలు కురిపించారు.  త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో  ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయమై ఆయన త్వరలోనే వెల్లడించనున్నట్టు ప్రకాష్ రాజ్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?