ఏపీ సీఎం జగన్ స్కీమ్‌పై కేసీఆర్ ప్రశంసలు.. ఇంతకీ ఏమన్నారంటే..

By Sumanth Kanukula  |  First Published Oct 15, 2023, 4:43 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ అమలు తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.


ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ అమలు తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ  ప్రజలపై పలు హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఆసరా పెన్షన్లు రూ. 2,016 అందిస్తున్నట్టుగా చెప్పారు. 

అయితే వచ్చే ఏడాది మార్చి తర్వాత ఆసరా పెన్షన్‌ను రూ. 3 వేలకు పెంచి.. ప్రతి ఏడాది 500 రూపాయలు పెంచుతూ.. ఐదో సంవత్సరం వరకు రూ. 5 వేలకు చేరుకుంటుందని అన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఒకేసాని భారం పడే అవకాశం ఉండదని అన్నారు. ఏపీలో కూడా ఇదే విధంగా అక్కడి ముఖ్యమంత్రి విజయవంతం చేశారని ప్రస్తావించారు. 

Latest Videos

సీఎం జగన్.. సక్సెస్‌ఫుల్‌గా ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారని చెప్పారు. రూ. 2 వేలతో ప్రారంభించారని.. ఇప్పుడు దానిని రూ. 3 వేలకు తీసుకొచ్చారని అన్నారు. చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగిందని చెప్పారు.  అదే పద్దతిలో తెలంగాణలో కూడా తాము రూ. 3 వేలు తక్షణమే చేస్తామని.. క్రమంగా ప్రతి సంవత్సరం రూ. 500 పెంచుతూ ఐదో ఏడాదికి రూ. 5 వేలకు చేరేలా చేస్తామని చెప్పారు. తద్వారా ప్రభుత్వంపై ఒకేసారి భారం పడే అవకాశం ఉండదని అన్నారు.  

అలాగే.. దివ్యాంగులకు పెన్షన్‌ను ఇటీవల రూ. 4 వేలకు పెంచామని.. దానిని రూ. 6 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే మార్చి తర్వాత రూ. 5 వేలకు పెంచి.. ఆ తర్వాత పెంచుకుంటూ పోతామని చెప్పారు. ప్రతి ఏడాది రూ. 300 పెంచుకుంటూ.. ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తామని తెలిపారు. 
 

click me!