వరంగల్ జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

By narsimha lode  |  First Published Mar 5, 2024, 6:25 AM IST


విద్యుత్ షాక్  ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదాన్ని నింపింది. మోత్యా తండాలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు.


వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  పర్వతగిరి మండలం మోత్యా తండాలో  మంగళవారంనాడు తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు.మోత్యాతండాలో  ఇవాళ  జాతర ఉంది. ఇందుకు సంబంధించి గ్రామంలో  ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి  ముగ్గురు మృతి చెందారు.  ఈ ఘటనలో  ఆరేళ్ల బాలుడు కూడ తీవ్రంగా గాయపడ్డారు. ఆరేళ్ల బాలుడితో పాటు  మరో నలుగురు కూడ గాయపడ్డారు.

also read:పెద్దన్నలా మోడీ సహకరించాలి: ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి

Latest Videos

undefined

టెంట్ వేస్తున్న సమయంలో  ప్రమాదవశాత్తు  విద్యుత్ తీగ తెగి  ఈ ప్రమాదం జరిగినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు.  ఈ ప్రమాదంలో   భూక్య రవి, బానోతు సునీల్,  గగులోతు దేవేందర్ లు మృతి చెందారు.  ఈ ప్రమాదంలో  రవి, సునీల్, జశ్వంత్, ఈర్య గాయపడ్డారు. గాయపడ్డవారిని  చికిత్స నిమిత్తం  ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

also read:ఆదిలాబాద్‌లో మోడీ టూర్: రూ. 56 వేల కోట్లతో పలు పనులను ప్రారంభించిన ప్రధాని

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.  గాయపడిన వారిని చికిత్స కోసం  ఆసుపత్రికి తరలించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ షాక్ తో  పలువురు మరణించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి.

హైద్రాబాద్ కూకట్ పల్లిలోని ఓ అపార్ట్ మెంట్ వద్ద విద్యుత్ షాక్ తో గంగా భవానీ అనే మహిళ 2023 ఆగస్టు  10వ తేదీన  మృతి చెందారు.బోర్ వేయడానికి వెళ్లిన మహిళ  విద్యుత్ షాక్ తో మృతి చెందారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం మోళ్లపర్రులో  విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందిన ఘటన 2023 జూలై ఆరున చోటు చేసుకుంది. చేపల చెరువుకు  ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను పట్టుకొని ఇద్దరు మృతి చెందారు.

2023  జూన్  6న  హైద్రాబాద్ కేపీహెచ్‌బీలో  విద్యుత్ షాక్ తో ఓ మహిళ మృతి చెందారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు విద్యుత్ షాక్ కు గురైన విషయాన్ని గుర్తించి బాలుడిని రక్షించిన ఆమె మృతి చెందారు.

click me!