ప్రారంభమైన టీఆర్ఎల్పీ భేటీ:వరిపై ఢిల్లీలో పోరుకు కేసీఆర్ ప్లాన్

By narsimha lodeFirst Published Nov 16, 2021, 4:33 PM IST
Highlights


వరిపై ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో ఈ విషయమై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. 

హైదరాబాద్: వరిపై  ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.  ఈ విషయమై టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం మంగళవారం నాడు హైద్రాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్ లో జరిగింది.కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది.టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో ఢిల్లీలో ఆందోళన గురించి కేసీఆర్ పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకొనే అవకాశం ఉంది.వరి ధాన్యంపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని  తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నవంబర్ 29న నిరహార దీక్షకు దిగాడు. అదే రోజున ఢిల్లీ కేంద్రంగా దీక్ష చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. అయితే ఈ విషయమై పార్టీ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను కేసీఆర్ తీసుకొంటారు.పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా paddy ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని trs భావిస్తోంది.  టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ఆందోళన చేయాలని kcr భావిస్తున్నారు. ఢిల్లీలో ఆందోళన చేయడం ద్వారా రాజకీయంగాbjpని ఇరుకున పెట్టాలని  గులాబీ బాస్ భావిస్తున్నారు.

వరి అంశాన్ని అస్త్రంగా చేసుకొని బీజేపీపై టీఆర్ఎస్ నాయకత్వం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ  నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళనలలో టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేయాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది.తెలంగాణలో రాజకీయంగా బీజేపీ బలపడకుండా ఉండేందుకు గాను టీఆర్ఎస్ నాయకత్వం వరి అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చిందనే రాజకీయంగా బీజేపీకి చెక్ పెట్టే ప్రయత్నాలను చేస్తోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. 

also read:కారణమిదీ:బండి సంజయ్ పై నల్గొండలో కేసు

ఈ నెల మొదటి వారం నుండి వరిపై  పోరు అంశం తెర మీదికి వచ్చింది. వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ధర్నాకు దిగారు. యాసంగిలో వరి ధాన్యం పండించాలని  రైతులను కోరారు. అయితే ఈ విషయమై టీఆర్ఎస్ నేతలు బీజేపీపై మండిపడ్డారు కేంద్రం నిర్ణయాన్ని స్థానిక బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. అయితే కేంద్రం నుండి అక్షింతలు పడడంతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు యాసంగిలో వరి ధాన్యం పండించాలనే డిమాండ్ పై యూ టర్న్ తీసుకొన్నారని టీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.వ

రి ధాన్యం కొనుగోలు విషయంలో బాయిల్డ్ రైస్ మినహా రా రైస్ కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే పండించేందుకు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు అనకూలిస్తాయని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.  మరోవైపు రాష్ట్రంలో ఎంత వరి ధాన్యం దిగుబడి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అంచనా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలను టీఆర్ఎస్ తిప్పికొడుతుంది.

 


 

click me!