కారణమిదీ:బండి సంజయ్ పై నల్గొండలో కేసు

By narsimha lodeFirst Published Nov 16, 2021, 3:37 PM IST
Highlights

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పర్యటన సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకోకుండా పర్యటించినందున కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

నల్గొండ: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నల్గొండలో పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు బండి సంజయ్ అనుమతి తీసుకోలేదని జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రకటించారు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేకుండా బండి సంజయ్ పర్యటించడం సరికాదని ఎస్పీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోడ్ సమయంలో అనుమతి లేకుండా  పర్యటించినందున కేసు నమోదు చేసినట్టుగా జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

ఈ నెల 15, 16 తేదీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పర్యటించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పర్యటించారు. అయితే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు సంజయ్ వచ్చిన సమయంలో బీజేపీ టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. అర్జాలబావి, శెట్టిపాలెం, చిల్లేపల్లి వద్ద నిన్న బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఇవాళ కూడ సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ టూర్ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. బండి సంజయ్ టూర్ ను  టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి.

paddy ధాన్యం కొనుగోలు విషయమై bjp, trs నేతల మధ్య మాటల యుద్దం సాగుతుంది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. అంతేకాదు వరిని పండించవద్దని కూడ రైతులను కోరింది. వర్షాకాలంలో వరి ధాన్యాన్ని కోనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని సీఎం kcr డిమాండ్ చేశారు.ఈ విషయమై ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. అయితే అంతకు ఒక్క రోజు ముందే వర్షాకాలంలో  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు.

also read:వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాడ్లు, కర్రలతో వెళ్తారా?: బండి సంజయ్‌కి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్న

వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తీసుకొని బీజేపీని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ధాన్యం కొనుగోలు విషఁయంలో కేంద్రం వైఖరిని చెప్పాలని  టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరశైలిని ఎండగట్టేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.వరి ధాన్యం  విషయమై అవసరమైతే ఢిల్లీలో ఆందోళనలకు కూడ టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. బీజేపీ తీరును ఢిల్లీ వేదికగా ఎండగట్టాలని  టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

click me!