ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు: కేసీఆర్ ముందస్తు సంకేతాలు

By narsimha lodeFirst Published Aug 24, 2018, 5:39 PM IST
Highlights

ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్  పార్టీ ప్రజా ప్రతినిధులకు చెప్పారు.  ఎన్నికలకు సిద్దంకావాలని ఆయన కోరారు.సిట్టింగ్ ఎంపీలకు  టిక్కెట్టు ఇస్తామని  కేసీఆర్ హమీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని కూడ కేసీఆర్  పార్టీ ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. 
 

హైదరాబాద్:ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్  పార్టీ ప్రజా ప్రతినిధులకు చెప్పారు.  ఎన్నికలకు సిద్దంకావాలని ఆయన కోరారు.సిట్టింగ్ ఎంపీలకు  టిక్కెట్టు ఇస్తామని  కేసీఆర్ హమీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని కూడ కేసీఆర్  పార్టీ ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. 

శుక్రవారం నాడు టీఆర్ఎస్ పార్టమెంటరీ పార్టీ, టీఆర్ఎస్ శాసనసభ పక్షంతో కేసీఆర్ సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్  స్పష్టత ఇచ్చారు.
 

మూడు రోజుల  క్రితం మంత్రులతో సుమారు ఐదు గంటలకు పైగా కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై మంత్రులు నిర్ణయాన్ని తనకు కట్టబెట్టినట్టుగా కేసీఆర్ శుక్రవారం నాడు జరిగిన పార్లమెంటరీ, శాసనసభపక్ష సంయుక్త సమావేశంలో  కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 ఏ క్షణంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ సూచన ప్రాయంగా చెప్పారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని గురించి కేసీఆర్  పార్టీ ప్రజా ప్రతినిధులకు  వివరించారు.

సెప్టెంబర్ రెండో తేదీన నిర్వహించే సభకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 25 వేల మందిని  తరలించాలని కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు.  మరో వైపు ఈ సభకు  జనం తరలింపుకు అవసరమైన వాహానాలను అవసరమైతే ఇతర రాష్ట్రాల నుండి  తీసుకోవాలని కోరారు.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన కూడ కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై తమకు వదిలేయాలని కోరినట్టు చెప్పారు. ఆరు మాసాల ముందు ఎన్నికలకు వెళ్లాలా... నాలుగు మాసాల ముందు వెళ్లాలా  అనే విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు. 

అయితే డిసెంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహణకు సంబంధించి  సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే  డిసెంబర్ లో ఎన్నికలు జరగాలంటే  సెప్టెంబర్ మాసంలోనే  అసెంబ్లీ రద్దు చేయాల్సిన  అనివార్యం. అయితే డిసెంబర్‌లోనే ఎన్నికలకు కేసీఆర్ వెళ్తారా.. ఆ తర్వాత వెళ్తారా అనే దానిపై  మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే గ్రేటర్ హైద్రాబాద్‌లో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్  అన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంటుందని కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో వచ్చిన సీట్ల  కంటే 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు చెప్పారు.

పలు సర్వే నివేదికను కేసీఆర్ ఈ మేరకు  ఈ సమావేశంలో  ప్రస్తావించారు. వంద నియోజకవర్గాల్లో 50 రోజుల పాటు కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురి పరిస్థితి బాగా లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేవని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు వారికి నామినేటేడ్ లాంటి పదవులు ఇవ్వబోమని కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించినట్టు సమాచారం.

ఈ వార్తలు చదవండి

కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు

20 రోజుల్లో రెండో సారి హస్తినకు కేసీఆర్: ముందస్తుపై పుకార్ల జోరు

సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ: కొంగరలో ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్
 

click me!