ఇటీవలి కాలంలో కోతులు (monkeys), అడవి పందులు (Wild boars) ఆరణ్యాలను వీడి గ్రామాలు, పట్టణాల్లోకి చేరుతున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్(cm kcr).. ఈ సమస్యను పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను (cs somesh kumar) కోరారు.
ఇటీవలి కాలంలో కోతులు (monkeys), అడవి పందులు (Wild boars) ఆరణ్యాలను వీడి గ్రామాలు, పట్టణాల్లోకి చేరుతున్నాయి. వీటివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. కొన్నిచోట్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోతులు, అడవి పందుల బెడద పెరిగిపోవడంతో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. ఈ సమస్యను పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను (cs somesh kumar) కోరారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో సీఎస్ కూడా వేగంగా స్పందించారు.
ఆ దిశగా ఉన్నత అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్‌కు భవన్‌లో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో కోతులు, అడవి పందుల బెడద నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో.. అటవీ, వ్యవసాయ, పశువైద్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులే కాకుండా.. కోతులు, అడవి పందుల బెడద నివారణలో నైపుణ్యం ఉన్నవారు కూడా పాల్గొన్నారు.
undefined
తమ పంటలను కోతుల నుంచి కాపాడుకునేందుకు పలు సంప్రదాయ విధానాలు పాటించేలా రైతులను చైతన్య పరచాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కోతులు, అడవి పందుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి.. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
ఇందుకు సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడూ..‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కోతులు, అడవి పందుల సంఖ్యలను అంచనా వేస్తుంది. అడవి ప్రాంతాలకు సరిహద్దుల్లో ఉన్న పొలాల్లో కోతులకు నచ్చని బ్రాడ్ బీన్స్, ఫీల్డ్ బీన్స్.. వంటివి సాగు చేయడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఇక, కమినిటీ నివేదిక అందజేసిన తర్వాత దానిపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఆ తర్వాతే కోతులు, అడవి పందుల నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసే అవకాశం ఉంది.