దేవరయంజాల్ భూములు: ఏసీబీ, విజిలెన్స్ విచారణకు కేసీఆర్ ఆదేశం

By narsimha lodeFirst Published May 3, 2021, 6:31 PM IST
Highlights

దేవరయంజాల్ భూముల కుంభకోణంలో ఏసీబీ, విజిలెన్స్ విచారణకు  తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 

హైదరాబాద్: దేవరయంజాల్ భూముల కుంభకోణంలో ఏసీబీ, విజిలెన్స్ విచారణకు  తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దేవరయంజాల్ గ్రామంలోని శ్రీసీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా ఇతరులు ఆక్రమించారనే విషయమై ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు  ఈ విషయమై  సోమవారం నాడు ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 

also read:దేవరయంజాల్‌లో కేటీఆర్‌, మల్లారెడ్డికి భూములు: సీబీఐ విచారణకు రేవంత్ డిమాండ్

ఈ గ్రామానికి సోమవారం నాడు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు  విచారణ నిర్వహించేందుకు వెళ్లారు.  ఈ భూములు ప్రస్తుతం కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. అక్రమణదారులు కమర్షియల్ గోడౌన్లను నిర్మించుకొన్నారు. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు కూడ లేవని  ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై నిజానిజాలను తేల్చనున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ మెదక్ జిల్లాలోని  మాసాయిపేట, హకీంపేటల్లో సుమారు 600 ఎకరాలను ఆక్రమించారని ఆ జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 

click me!