వరకట్న వేధింపులు : ప్రేమపెళ్లి.. యేడాది నిండకుండానే వివాహిత ఆత్మహత్య.. !!

Published : May 03, 2021, 04:20 PM IST
వరకట్న వేధింపులు : ప్రేమపెళ్లి.. యేడాది నిండకుండానే వివాహిత ఆత్మహత్య.. !!

సారాంశం

ఓ ప్రేమజంట ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ వరకట్న వేధింపులు ఆ ప్రేమను చిదిమేశాయి. పెళ్లై ఏడాది కూడా గడవక ముందే వేధింపులు తట్టుకోలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన నల్గొండలో చోటుచేసుకుంది.

నల్గొండ, హుజూర్ నగర్ లో జరిగిన ఈ సంఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం యువతి మృతి చెందింది. ఎస్ ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలోని సుందరయ్య నగర్ కు చెందిన వంగ మౌనిక (20), వంగ నాగరాజు గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తరువాత వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఈ వేధింపులు భరించలేక మౌనిక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇది గమనించి ఆమెను హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మౌనిక మృతి చెందింది. దీంతో మౌనిక తల్లి సుజాత ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!