జిత్తన్నా ఏం చేస్తున్నావ్.. టీఆర్ఎస్ సీనియర్ నేతతో కేసీఆర్

By telugu news teamFirst Published Sep 15, 2021, 9:04 AM IST
Highlights

తాను అరటి పంట సాగు చేశానని.. ఎకరానికి రూ.లక్ష మిగులుతున్నాయని.. మార్కెటింగ్ సౌకర్యంతో పాటు.. ఉద్యానవనం ప్రోత్సాహం ఉంటే మరింత బాగుంటుందని పేర్కొన్నారు.

జగిత్యాలకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, నియోజకవర్గ మాజీ ఇన్ ఛార్జి మాకునూరి జితేందర్ రావును.. సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. సోమవారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్.. అక్కడ జితేందర్ రావును కలిశారు. ఈ సందర్భంగా... జిత్తన్నా ఎట్లున్నావ్.. ఎక్కడుంటున్నావ్ అంటూ యోగ క్షేమాలు అడగడం గమనార్హం.


జగిత్యాలలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటానని ఆయన బదులు ఇచ్చారు. దీంతో ఏయే పంటలు పండాిస్తున్నావ్ అని సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను అరటి పంట సాగు చేశానని.. ఎకరానికి రూ.లక్ష మిగులుతున్నాయని.. మార్కెటింగ్ సౌకర్యంతో పాటు.. ఉద్యానవనం ప్రోత్సాహం ఉంటే మరింత బాగుంటుందని పేర్కొన్నారు.

కొందరు చెరకు, ఆవాలు, సజ్జలు వేస్తున్నారని, మంచి లాభాలు వస్తున్నాయని జితేందర్ రావు వివరించారు. తమ గ్రామంలో అయిదెకరాల్లో డ్రిప్ పద్ధతిలో ఈత చెట్లు నాటామని, నీరాతో గీత  కార్మికులు మంచి ఆదాయం పొందుతున్నారని చెప్పారు. త్వరలోనే ప్రగతి భవన్ కు ఆహ్వానిస్తానని సీఎం ఆయనతో అన్నారు.

అనంతరం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు సైతం జితేందర్ రావుతో మాట్లాడగా.. అంతర్గాంలో రహదారి మంజూరు చేయాలని ఆయన కోరారు. వెంటనే మంజూరు చేస్తామని వారు చెప్పారు. అంతేకాకుండా.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని కూడా ఆయన వివరించారు. 
 

click me!