''యూనిఫాం సివిల్ కోడ్‌ను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది''

By Mahesh Rajamoni  |  First Published Jul 11, 2023, 10:15 AM IST

Hyderabad: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలును తాము వ్యతిరేకిస్తున్నామనీ, ఇది దేశంలో బహుళత్వం అంతానికి దారితీస్తుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూసీసీపై చర్చించేందుకు ఒవైసీ సీఎం కేసీఆర్ ను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకించాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. యూసీసీ అనేది కేవలం ముస్లిం సమస్య మాత్రమే కాదని, క్రిస్టియన్ సమస్య కూడా అని సీఎంకు తెలియజేశామన్నారు. ఇది ఈశాన్యంలోని గిరిజన సమాజం గురించి మాత్రమే కాదు, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి భారతదేశంలోని ఇతర ప్రాంతాల‌కు సంబంధించిన‌దిగా పేర్కొన్నారు.


Uniform Civil Code: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉమ్మడి పౌరస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటించింది. ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలలో భాగమనీ, ఇది ప్రజల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను అనుసరించడంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచిన దేశ ప్రజల శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రతిపాదిత బిల్లు హిందూ మత సిద్ధాంతాలను అనుసరించే వారితో పాటు ప్రత్యేక సంస్కృతులు కలిగిన వివిధ మతాలు, కులాలు, తెగల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ముస్లిం పండితులు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధుల బృందం సోమవారం తనను కలిసినప్పుడు ముఖ్యమంత్రి ఈ అంశంపై అధికార పార్టీ వైఖరిని స్పష్టం చేసినట్టు ది హిందూ నివేదించింది.

ప్రతిపాదిత బిల్లు వివిధ వర్గాల ఆచారాలు, సంప్రదాయాలకు ముప్పుగా ఉన్నందున దీనిని వ్యతిరేకించాలని, తద్వారా ప్రజల మధ్య ఐక్యతను కాపాడేందుకు కృషి చేయాలని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఈ బిల్లు దురుద్దేశంతో కూడుకున్నదని, గత తొమ్మిదేళ్లుగా బీజేపీ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఇలాంటి అంశాల ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందనీ, ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా పోరాటంలో భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని పోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావులను ఆదేశించారు.

Latest Videos

గంగా జమునా తెహ్జీబ్ (వివిధ వర్గాల ఐక్యత, శాంతియుత సహజీవనం) ను పరిరక్షించాలన్న తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినందుకు, పార్లమెంటులో బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది. అసదుద్దీన్ తో పాటు శాసనసభలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు కేటీఆర్, మహ్మద్ ఉన్నారు. ఈ సమావేశంలో మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలును తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది దేశంలో బహుళత్వం అంతానికి దారితీస్తుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూసీసీపై చర్చించేందుకు ఒవైసీ సీఎం కేసీఆర్ ను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకించాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. యూసీసీ అనేది కేవలం ముస్లిం సమస్య మాత్రమే కాదని, క్రిస్టియన్ సమస్య కూడా అని సీఎంకు తెలియజేశామన్నారు. ఇది ఈశాన్యంలోని గిరిజన సమాజం గురించి మాత్రమే కాదు, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి భారతదేశంలోని ఇతర ప్రాంతాల‌కు సంబంధించిన‌దిగా పేర్కొన్నారు. "యూసీసీని ప్రవేశపెడితే, భారతదేశ బహుళత్వం, లౌకికవాదం అంతమవుతుంది, ఇది మంచి విషయం కాదు. ప్రధాని మోడీ, బీజేపీ, ఆరెస్సెస్ లకు బహుళత్వం నచ్చడం లేదు" అని వ్యాఖ్యానించారు.

click me!